close

తాజా వార్తలు

Published : 27/09/2020 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒకే పథకంలో మదుపు చేయొద్దు

* మా పాప వయసు 8 ఏళ్లు. తన భవిష్యత్‌ అవసరాల కోసం అప్పుడప్పుడూ కొంత బంగారాన్ని కొంటున్నాను. కానీ, దీనికి బదులుగా గోల్డ్‌ ఫండ్లలో మదుపు చేయడం మేలు అని చెబుతున్నారు. నిజమేనా? రెండింటిలో ఏది మేలు?

- సుమతి

* బంగారాన్ని నేరుగా కొనడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా దాన్ని భద్రపర్చడం సమస్యే. కొన్ని ఇతర ఖర్చులూ ఉంటాయి. దీనికన్నా గోల్డ్‌ ఫండ్లు, గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల ద్వారా పసిడిని కొనడం ఉత్తమం. ఇవన్నీ ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఉంటాయి కాబట్టి, దీనివల్ల మీకు తరుగుదల, నిల్వ చేయడంలాంటి చిక్కులు ఉండవు. దీంతోపాటు సార్వభౌమ పసిడి బాండ్లనూ పరిశీలించవచ్చు. బంగారం ధర వృద్ధి చెందిన ఫలితంతోపాటు, ఏడాదికి 2.5శాతం వడ్డీ లభిస్తుంది.
* నేను మూడేళ్ల క్రితం 3 ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయడం ప్రారంభించాను. ఇందులో ఒకటి మంచి రాబడినిస్తుండగా.. రెండు ఫండ్లు అంత ఆశాజనకంగా లేవు. ఈ రెండు ఫండ్లలో ఉన్న మొత్తాన్నీ పనితీరు బాగున్న ఫండ్‌లోకి మళ్లించాలని ఆలోచిస్తున్నాను. ఇలా చేయడం మంచిదేనా?

- మహేశ్‌

* మార్కెట్‌ పనితీరును బట్టి, ఒక్కోసారి ఒక్కో ఫండ్‌ పథకం మంచి రాబడులను అందిస్తూ ఉంటుంది. స్వల్పకాలంలో ఫండ్లు బాగా చేయలేకపోయినంత మాత్రాన అవి పూర్తిగా విఫలం అయ్యాయని చెప్పలేం. ఒకే పథకంలో పెట్టుబడి పెట్టడం ఎప్పుడూ నష్టభయంతో కూడుకున్నదే. మిగతా రెండు ఫండ్ల పనితీరును మరోసారి నిశితంగా పరిశీలించండి. వాటి విభాగంలోని ఇతర ఫండ్లతో పోల్చి చూడండి. ఒకవేళ మీరు ఎంచుకున్న ఫండ్లే సరిగా చేయడం లేదని తేలితే.. వాటిని నిర్మొహమాటంగా మార్చేయండి. కనీసం 3-5 ఫండ్లలో మీ పెట్టుబడి ఉండేలా చూసుకోండి.

- సాయికృష్ణ పత్రి, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన