
తాజా వార్తలు
మ్యావ్.. మ్యావ్.. పిల్లి!
చింతచెట్టు పక్కన ఉన్న పాడుబడిన గుడిసెలో ఒక పిల్లి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అక్కడే ఎలుకలు, చిన్న చిన్న పురుగుల్ని తింటూ పిల్లల్ని ప్రేమగా పెంచుకోసాగింది. ఒక రోజు పెద్ద వర్షం కురిసి, గుడిసె కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి తన పిల్లల్ని ఎలాగో అలా రక్షించుకొన్న పిల్లి అప్పటికప్పుడు ఆ పక్కనే ఉన్న సాయవ్వ ఇంటిని పరిశీలించింది.
పనిమీద ఆమె పొరుగూరు వెళ్లడంతో పిల్లలతో సహా సాయవ్వ ఇంటికి పిల్లి మకాం మార్చింది. తినడానికి ఈ ఇంట్లో ఎలుకలు కానీ, పురుగులు కానీ దొరకలేదు. బయటేమో పెద్దగా వర్షం కురుస్తోంది. పొద్దున నుంచి ఏమీ తినకపోవడంతో తన పిల్లలకు సరిపడా పాలు ఇవ్వలేకపోయింది.ఆకలితో పిల్లలు ‘మ్యావ్.. మ్యావ్’ అంటూ అరవసాగాయి. వాటి ఆకలికేకలు చూసి తల్లి కడుపు తరుక్కుపోయింది. తప్పని తెలిసినప్పటికీ పెరుగు గిన్నెను దొర్లించి, తన పిల్లలకు తినిపించింది. సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టడంతో పిల్లల్ని సాయవ్వ ఇంట్లోని పాత చెక్కపెట్టె వెనుక దాచి, ఆహారం కోసం బయటకు వెళ్లింది.
పొరుగూరు వెళ్లిన సాయవ్వ సాయంత్రానికి తిరిగొచ్చింది. తోడుపెట్టిన పెరుగు గిన్నె కింద పడి ఉండటం, చుక్కపెరుగు లేకపోవడం చూసింది. తన ఇంట్లో పిల్లులు పడ్డాయని అర్థం చేసుకుని అంతా వెతికింది. చెక్కపెట్టె వెనకాల నక్కి ఉన్న పిల్లి పిల్లల్ని చూసి సాయవ్వ వాటిని కోపంతో కొట్టబోయింది.
‘ఆ పెరుగు తినకూడదని మాకు తెలియదు. మా అమ్మ చెబితేనే తిన్నాం’ అని చెప్పాయి పిల్లిపిల్లలు. ‘ఓహో.. అలాగైతే మీ అమ్మనే రానివ్వండి. సంగతేంటో చూస్తాను. అప్పటి వరకు మీరు ఈ గంప కింద పడి ఉండండి’ అంటూ పిల్లి పిల్లల్ని గంప కింద బంధించింది సాయవ్వ.
ఆహారం కోసం బయటకు వెళ్లిన పిల్లి రాత్రి పొద్దుపోయాక తిరిగొచ్చింది. గంప కింద బంధీలుగా ఉన్న తన పిల్లల్ని చూసి బాధపడింది. మంచం మీద నిద్రపోతున్న సాయవ్వను నిద్రలేపడానికి ‘మ్యావ్.. మ్యావ్.’ అంటూ అరిచింది.
అప్పటికే పిల్లిమీద కోపంగా ఉన్న సాయవ్వకు.. ఇప్పుడు అదే పిల్లి వల్ల నిద్రాభంగం కూడా కావడంతో దాన్ని కర్రతో తరిమి.. మళ్లీ మంచంపై వాలి నిద్రలోకి జారుకొంది. తల్లి పిల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. దిగులుగా గంప పక్కనే కూర్చుంది.
ఇంతలో ఒక దొంగ సాయవ్వ ఇంట్లోకి ప్రవేశించాడు. అవ్వ నిద్రపోతోందని గమనించి, నిదానంగా చెక్కపెట్టె తెరిచాడు. దొంగను గమనించిన పిల్లి సాయవ్వను నిద్రలేపడానికి ‘మ్యావ్.. మ్యావ్’ అంటూ గట్టిగా అరవసాగింది. పిల్లి ఎంత అరిచినా అవ్వ నిద్రలేవలేదు. ఇక లాభం లేదని ఒక్కసారిగా ఎగిరి అవ్వపైకి దూకింది. సాయవ్వ చటుక్కున నిద్రలేచి చూసింది. చెక్క పెట్టెలోని విలువైన వస్తువులను తీసుకుంటూ దొంగ కనబడ్డాడు.
మొదట కాస్త తత్తరపాటుకు గురైనా.. వెంటనే తేరుకుని ‘దొంగా.. దొంగా..’ అంటూ గట్టిగా అరిచింది. ఆ దొంగ సాయవ్వపై దాడి చేయాలనుకున్నాడు. కానీ పిల్లి.. వాడి చేతిని గట్టిగా కరిచింది. ఈలోపు ఇరుగుపొరుగు వచ్చి దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పిల్లి తనకు చేసిన ఉపకారానికి అవ్వ ఎంతగానో సంతోషపడింది. అప్పటి నుంచి సాయవ్వ ఆ పిల్లిని.. దాని నాలుగు పిల్లల్ని తన ఇంట్లోనే ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది.
- పేట యుగంధర్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- తాగడానికి తగని సమయముంటదా..!
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
