
తాజా వార్తలు
తాతా.. నువ్వు సూపర్.!
104 ఏళ్ల వయసు.. అయినా బోధనపైౖనే మనసు.. నిత్యం సాయంత్రం ఉచితంగా పాఠాలు.. 75 ఏళ్లుగా ఆ తాతది ఇదే ప్రయాణం.. ఆ విశేషాలు తెలుసుకుందామా..!!
ఒడిశా రాష్ట్రం జాజ్‌పుర్ జిల్లా బార్తాండకు చెందిన నంద ప్రాస్తికి 104 ఏళ్లు. అసలు ఒక మనిషి ఇన్నేళ్లు బతకడమే గొప్ప. ఒకవేళ జీవించి ఉన్నా.. మంచానికి పరిమితమవడమో, ఇంట్లోనే ఉండటమో చేస్తారు. కానీ, ఈ తాత మాత్రం అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రతి రోజూ.సాయంత్రం పిల్లలకు చదువు చెబుతున్నాడు. అలా అని డబ్బులు వసూలు చేస్తాడేమో అని అనుకోకండి. ఎవరి దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోడు. అక్షర జ్ఞానం లేని పెద్దలు కూడా ఈయన దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 75 ఏళ్లుగా ఆయన ఓ పెద్ద చెట్టు కిందే ఉచితంగా పాఠాలు బోధిస్తున్నాడు.
సంతకం నేర్పించాలనుకొని..
తాతకు బోధనంటే ఇష్టం. అందుకే ఇన్నేళ్లుగా విరామం లేకుండా పిల్లలకు, పెద్దలకు పాఠాలు చెబుతున్నాడు. మొదట్లో ఆ తాత వ్యవసాయం చేసుకునేవాడంట. ఊర్లోని వారికి సంతకం చేయడమూ రాకపోవడంతో వేలిముద్రే పెట్టేవారంట. వారికి ఎలాగైనా సంతకం చేయడం నేర్పించాలని అనుకున్నాడు. వారంతా ఆసక్తి చూపడంతో ప్రతి రోజూ సాయంత్రం బడి నిర్వహించేవాడు. అంతేకాదండోయ్.. తన మొదటి బ్యాచ్ విద్యార్థుల పిల్లలు కూడా ఇప్పుడు తాత దగ్గరే చదువుతున్నారంట.
ప్రభుత్వ సాయం వద్దని..
ఎప్పటి నుంచో చెట్టు కిందే తరగతులు కొనసాగిస్తుండటంతో.. ఆయన కష్టాన్ని చూసిన అక్కడి నాయకులు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని చెప్పారట. అయినా ఆ పెద్దాయన దాన్ని తిరస్కరించాడంట. నాలుగు గోడల మధ్య కాకుండా బయటే పాఠాలు చెబుతానని స్పష్టం చేశాడు. ఎంత మంచి తాతో కదా..!
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
