
తాజా వార్తలు
పాలు బాగా రావాలంటే..?
నాకు ఈ మధ్యే పాప పుట్టింది. ప్రసవమైన రోజు నుంచీ ఒక్కొక్కరూ ఒక్కోటి తినమని సలహా ఇస్తున్నారు. కొందరేమో పథ్యం ఉండాలంటున్నారు. చిన్నారికి పాలు సమృద్ధిగా రావాలంటే నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి? - వనిత, నిజామాబాద్
పుట్టిన బిడ్డకు సరిపోయేన్ని పాలు ఇచ్చేలా మహిళ శరీర నిర్మాణం ఉంటుంది. అతికొద్ది మంది మాత్రమే ఈ నిర్మాణంలో చిన్నపాటి తేడాల వల్ల కాస్త ఇబ్బంది పడతారు. తల్లిగా మారిన ప్రతీ మహిళా శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా సానుకూల ఆలోచనలతో మానసికంగానూ సిద్ధమైనప్పుడే పాలు పడతాయి. సహజ ప్రసవమైనా, సిజేరియన్ అయినా ఎంత త్వరగా బిడ్డకు తల్లి స్తన్యాన్ని అందిస్తే అంత మంచిది. ఇలా చేస్తే పాలు త్వరగా వస్తాయి. బిడ్డకు మరిన్ని పోషకాలు అందాలంటే తల్లి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్-బి కాంప్లెక్స్, విటమిన్-సి ఉన్న పదార్థాలను తీసుకున్నప్పుడు మాత్రమే అవి పాల ద్వారా బిడ్డకు అందుతాయి. అలాగే బాలింతలు రోజుకు దాదాపు రెండున్నర లీటర్ల నీళ్లు తాగాలి. సహజ ప్రసవమైతే మాములుగా రోజూ తీసుకునే ఆహార పదార్థాలనే బాలింతకు పెట్టొచ్చు. సిజేరియన్ అయితే, ఆరు గంటల తరువాత ఆహారాన్ని బాగా మెత్తగా చేసి పెట్టాలి. ఆహారంలో మాంసకృత్తులు ఉండేలా చూడాలి. ఇందుకోసం పాలు, పెరుగు, గుడ్డు, పప్పు దినుసులు, సోయా నగ్గెట్స్, పనీర్, మటన్, చికెన్ లాంటివి పెట్టాలి. అన్నిరకాల కూరగాయలూ, ఆకుకూరలూ కలిపి రోజూ 300 గ్రా. వరకు బాలింతలకు పెట్టాలి. వీటి నుంచి పీచు, ఇనుము, ఫోలిక్ యాసిడ్, కాల్షియం అందుతాయి. పసుపు, నారింజ రంగు పండ్లలో ఏదో ఒకటి రోజూ తీసుకునేలా చూడాలి. వీటితోపాటు మేలైన కొవ్వుల్నీ తీసుకోవాలి. నువ్వులు, పల్లీ, రైస్‌బ్రాన్, ఆవనూనెలను వాడుకోవచ్చు. అవిసెగింజలు, అక్రోట్స్ లాంటి నట్స్ పెట్టాలి. పోషకాలు లేని, ఎక్కువ చక్కెర, నూనె ఉన్న తీపి పదార్థాలు, వేపుళ్లు, ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్లు తీసుకోవద్దు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
