close

తాజా వార్తలు

Updated : 31/10/2020 19:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంసారం చేయట్లేదు... ఎవరికీ చెప్పొద్దంటున్నాడు

నాకు పెళ్లై ఏడాది దాటింది. మొదటి రాత్రే నా భర్త దాంపత్య జీవితానికి పనికి రాడనే నిజం తెలిసింది. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దని వేడుకున్నాడు. అతను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. కానీ పెళ్లై ఏడాది దాటినా విశేషం ఏమీ లేదని అత్తగారు సాధిస్తున్నారు. నా భర్త నుంచి విడాకులు తీసుకోవాలంటే నేనేం చేయాలి? మరోపక్క మా పుట్టింటి ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. నేను అందంగా ఉంటానని పైసా కట్నం తీసుకోకుండా కోరి నన్ను పెళ్లి చేసుకున్నారు. అటు పుట్టింటికి వెళ్లలేను. అత్తింట్లో ప్రశాంతంగా ఉండలేను. చట్టపరంగా నాకు సాయమేదైనా అందుతుందా?

- ఓ సోదరి

ప్పకుండా మీరు చట్టం సాయం తీసుకోవచ్చు. కానీ మీ భర్త అడిగిన ప్రకారం ఎవరికీ తెలియకుండా జరగదు. భార్యాభర్తల మధ్య వైవాహిక సంబంధం లేకపోతే హిందూ వివాహచట్టంలోని సెక్షన్‌ 12 అనుసరించి ఆ పెళ్లి చెల్లదని తీర్పు ఇవ్వమని కోర్టుని కోరవచ్చు. సెక్షన్‌ 12(ఎ) ప్రకారం అతను/ఆమె సంసార జీవితానికి పనికిరారనే విషయం డాక్టరు ద్వారా నిరూపించాల్సి ఉంటుంది. మీ భర్త ఒకవేళ అలా పరీక్ష చేయించుకోవడానికి ఇష్టపడకపోతే మీరు సాక్ష్యాధారం సంపాదించలేరు. ముందుగా ఇది సాధ్యం కానప్పుడు కోర్టులో వివాహ రద్దుకోసం పిటిషన్‌ వేయండి. ఆ తరువాత కోర్టుని అతడికి లైంగిక సామర్థ్య పరీక్ష చేయించమని కోరవచ్చు. ముందు ఈ విషయం అమ్మానాన్నల దృష్టికి తీసుకెళ్లి మధ్యవర్తుల దగ్గర పెట్టండి. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి పెళ్లికయిన ఖర్చులు, మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు పరిహారం కింద కొంత మొత్తం చెల్లించమని అడగండి. ఇదంతా అనవసరం అనుకుంటే ఇద్దరి సమ్మతితో సెక్షన్‌ 13(బి) కింద పరస్పర అనుమతితో విడాకులు తీసుకోవచ్చు. ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచిది.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని