
తాజా వార్తలు
పూల బిస్కెట్లు నచ్చాయా..!
ఫుడ్ఆర్ట్
బిస్కెట్లు అనగానే... తియతియ్యగా ఉండేవి లేదా కాస్త కారంగా ఉండేవే సాధారణంగా గుర్తుకొస్తాయి. కానీ ఈ బిస్కెట్ల రూటే వేరు. ఇవి అందమైన పూల రేకలతో ముస్తాబై ఉంటాయి. కేవలం అలంకరణ కోసమే వీటిని ఇలా ముస్తాబు చేశారనుకుంటే పొరపాటే. వీటిని ఎంచక్కా తినేయొచ్చు కూడా. సేంద్రియ పద్ధతుల్లో పండించిన పూలను ఇలా బిస్కెట్ల మీద అద్దుతున్నారు. అంటే రుచికరంగా ఉండే బిస్కెట్లకు రంగు రంగుల పూలరేకలను అంటించి పోషకాలనూ జతచేస్తున్నారు. చూడచక్కని ఈ బిస్కెట్లను వినియోగదారులు ఎంతో ముచ్చటపడి కొనుక్కుంటున్నారట.
Tags :