close

తాజా వార్తలు

Published : 06/11/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డెట్‌ ఫండ్లు మేలేనా?

నేను పదవీ విరమణ చేశాను. నా దగ్గరున్న కొంత మొత్తాన్ని డెట్‌  మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసి, నెలకు కొంత మొత్తాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా? 

 - శ్యాంసుందర్‌

ముందుగా మీరు మీ దగ్గరున్న మొత్తాన్ని సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో పెట్టుబడి పెట్టుకోండి. ఇందులో రూ.15లక్షల వరకూ జమ చేసేందుకు అవకాశం ఉంది. మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. ఇందులో 7.4శాతం వడ్డీ ఇస్తున్నారు. దీంతోపాటు ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాన్ని పరిశీలించండి. ఇందులోనూ రూ.15లక్షల వరకూ పెట్టుబడి పెట్టే వీలుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి వడ్డీ మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇవి పూర్తి సురక్షితంగా ఉంటూ, కచ్చితమైన వడ్డీని చెల్లిస్తాయి. వడ్డీకి మించి ఎక్కువ మొత్తాన్ని తీసుకునేందుకు ఈ రెండు పథకాల్లోనూ వీలు కాదు. ఈ రెండు పథకాల్లో పెట్టుబడి పెట్టిన తర్వాత మిగిలిన మొత్తాన్నే మంచి క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న షార్ట్‌ టర్మ్‌ డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు.


మా పాప పేరుమీద పీపీఎఫ్‌ ఖాతా ప్రారంభించాలనుకుంటున్నాను. నెలకు కనీసం రూ.3,000 ఇందులో జమ చేస్తాను. కానీ, దీనికన్నా అధిక రాబడి బీమా పాలసీల్లో వస్తుందంటున్నారు. నిజమేనా? నేను ఏ పథకాలను ఎంచుకోవాలి?  

- ప్రసన్న

ప్రస్తుతం ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో 7.1శాతం వడ్డీ లభిస్తోంది. వచ్చిన వడ్డీ ఆదాయంపై ఎలాంటి పన్నూ ఉండదు. కనీసం 15 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించాలి. ఏడాదికి కనీసం రూ.500, గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మదుపు చేయొచ్చు. సంప్రదాయ బీమా పాలసీలు.. పీపీఎఫ్‌ కంటే అధిక రాబడినిచ్చే అవకాశం లేదు. తక్కువ రుసుములు, మంచి పనితీరున్న యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలను ఎంచుకుంటే.. దీర్ఘకాలంలో పీపీఎఫ్‌ను మంచి రాబడినిచ్చే వీలుంది. కనీసం 10-15 ఏళ్ల వ్యవధికి ఈక్విటీ ఫండ్లలో మదుపు చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. రూ.1,500 పీపీఎఫ్‌లోనూ, మిగతా మొత్తంతో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో సిప్‌ చేయండి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని