close

తాజా వార్తలు

Updated : 08/11/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాలుగేళ్లవుతున్నా పిల్లలు లేరు!

మా పెళ్లై నాలుగేళ్లవుతుంది. ఇంకా పిల్లలు లేరు. ఇద్దరం ఉద్యోగులమే. ఎక్కడికి వెళ్లినా ఇంకా పిల్లలు లేరా అని అడుగుతున్నారు. దాంతో బయటకు వెళ్లలేకపోతున్నా.. బాగా కుంగిపోతున్నా. ఈ విషయం గురించి ఎన్నిసార్లు తనతో మాట్లాడినా పట్టించుకోవట్లేదు. ఎప్పుడూ పని పని అంటూ ఉంటాడు. తన ఆరోగ్యం గురించి పట్టించుకోడు. తనని ఎలా మార్చాలి? పోనీ నేను ఎలా మారాలి?

 - ఓ సోదరి

పిల్లలు కావాలా... వద్దా... అనేది పూర్తిగా మీ భార్యాభర్తల వ్యక్తిగత విషయం. బయటివారు మాటిమాటికీ అడుగుతున్నారని మీరు బాధపడాల్సిన పనిలేదు. బయటవారి గురించి మరిచిపోండి. కానీ మీ ఇద్దరూ చర్చించుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. పెళ్లై నాలుగేళ్లయినా పిల్లలు కలగడం లేదంటే... మొదట మీరు వైద్యులను సంప్రదించి విడివిడిగా పరీక్షలు చేయించుకోవాలి. మీవారికి చిన్నారులంటే ఇష్టం ఉందా లేదా అనే విషయం తెలుసుకోండి. పిల్లల పెంపకం గురించి తనకు ఏమైనా ఆందోళనలు ఉన్నాయేమో అది కూడా కనుక్కోండి. ఈ సమస్యలు లేకపోతే.. పరీక్షలు చేయించుకుని వాటికి అనుగుణంగా చికిత్స తీసుకుంటే మీ సమస్య తేలిగ్గానే పరిష్కారం అవుతుంది. మొదట ఈ విషయాలన్నింటి గురించి మీ వారికి అనునయంగా చెప్పండి. పిల్లలు కావాలనుకునే జంటకు మానసికంగా, శారీరకంగా ఒకరిపట్ల మరొకరికి ప్రేమానుబంధాలు ఉండాలి. అందుకోసం పని ఒత్తిడిని తగ్గించుకుని ఇద్దరూ మీ కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నామని రాశారు. కాబట్టి పనికి కొంత సమయం పెట్టుకుని మిగతా టైమ్‌ని మీ ఇద్దరూ ఆనందంగా గడపడానికి కేటాయించుకోవాలి. ఒకవేళ మీవారు పిల్లల పట్ల ఆసక్తి చూపించకపోతే... ఈ విషయాన్ని మీ ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేయండి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని