close

తాజా వార్తలు

Published : 22/11/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కన్నడిగుల కర్దంటు

పొరుగింటి రుచి

ఈకాలంలో చలిచలిగా ఉండి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదూ... అలాంటప్పుడు డ్రైఫ్రూట్స్‌, బెల్లంపాకంతో చేసే ఈ కర్దంటు స్వీట్‌ని కన్నడిగులు ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారుచేయాలో మనమూ తెలుసుకుందామా...

కావాల్సినవి: బెల్లం- పావుకేజీ, సెనగపిండి- పావుకేజీ, నెయ్యి- 25 గ్రా., జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు- రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుకొబ్బరి- 100 గ్రా., పచ్చకర్పూరం, యాలకులపొడి- చిటికెడు.
తయారీ: కడాయిలో నెయ్యి పోసి వేడిచేసి జీడిపప్పు, బాదం మొదలైనవి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే సెనగపిండి వేసి వేయించాలి. బెల్లాన్ని తీగ పాకం పట్టుకుని దాంట్లో సెనగపిండిని వేసి ఉండల్లేకుండా కలపాలి. చివరగా వేయించిన పప్పులు, పచ్చకర్పూరం, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.  ఇప్పుడు ప్లేటు నిండా నెయ్యి రాసి దాని మీద ఈ మిశ్రమాన్ని పరచాలి. కాస్త గట్టిపడిన తర్వాత దీన్ని గుండ్రంగా లేదా చదరాల్లా కోసుకోవాలి. బెల్లానికి బదులుగా కొందరు పంచదారను వాడుతుంటారు. బెల్లం ఆరోగ్యానికి మంచిది కాబట్టి దీన్ని వాడటమే మేలు.

- చల్లా పద్మజ



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని