close

తాజా వార్తలు

Published : 26/11/2020 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శక్తినిచ్చేది సహనమే!

ఇస్లాం సందేశం

‘‘ఓర్పు వహించే వారికి లెక్కలేనంత ప్రతిఫలం అందుతుంది’’ -దివ్య ఖురాన్‌
కుస్తీపట్టి ఇతరులను చిత్తు చేసేవాడు పరాక్రమశాలి కాదు. కోపం వచ్చినప్పుడు తనను తాను అదుపులో పెట్టుకున్న సహనశీలుడే నిజమైన పరాక్రమవంతుడు అని సెలవిచ్చారు మహాప్రవక్త (స). కోపం రావడం అనేది ప్రతి మనిషికి ఉన్న సహజ గుణమే. కానీ కోపం వచ్చినప్పుడు అహంకారంతో ఇతరులపై ప్రతాపం చూపకూడదు. సాధ్యమైనంత వరకు ఆ కోపాన్ని దిగమింగడానికి ప్రయత్నించాలి. కోపానికి వశులై కయ్యానికి కాలుదువ్వి బలప్రదర్శన చేయడం బలవంతుల సామాన్య లక్షణం. అయితే ముంచుకొస్తున్న క్రోధాన్ని అణచుకొని, ఎదుటివారిని చిత్తు చేసే బలం ఉండి కూడా.. సహనం వహించాలి. అది అన్నంత తేలిక కాదు. దైవంపై విశ్వాసం ఉన్న వాళ్లు మాత్రమే అలాంటి సంయమనం పాటించగలుగుతారు.

-ఖైరున్నీసాబేగం



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని