close

తాజా వార్తలు

Published : 16/12/2020 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నీరు అక్కడక్కడే!

సైన్స్‌

అంగారకుడి మీద కాలు మోపాలనే తపన, అక్కడ నివాసం ఏర్పరచుకోవాలనే కోరిక ఈనాటిది కాదు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అక్కడ జీవాన్వేషణ కోసమూ పరిశోధిస్తున్నారు. వీటి కోసం ఎక్కడని వెతికేది? అంగారకుడిని మొత్తం జల్లెడ పట్టటం సాధ్యమేనా? దీన్ని సులభం చేయటానికే అర్కాన్సస్‌ సెంటర్‌ ఫర్‌ స్పేస్‌ అండ్‌ ప్లానెటరీ సైన్స్‌ పరిశోధకులు నడుం బిగించారు. ప్రాణుల పుట్టుకకు, మనుగడకు ప్రాణాధారమైన నీరు ఉన్న ప్రాంతాలను గుర్తించటంపై దృష్టి సారించారు. ఇప్పటివరకూ అక్కడ చాలా చోట్ల నీరు ఉందనే అనుకుంటున్నారు. కానీ అంతా ఊహిస్తున్నట్టుగా అంగారకుడిపై విస్తృతమైన ప్రాంతాల్లో నీరేమీ లేదని తాజాగా గుర్తించారు. అంగారకుడి మాదిరి వాతావరణాన్ని పోలిన సిమ్యులేషన్‌ గదిలో, గ్రహ వాతావరణ ప్రసరణ నమూనాలతో పరిశోధకులు నిశితంగా అధ్యయనం చేశారు. వీటి సమాచారం ఆధారంగా ఉప్పు నీరు ఉండటానికి అవకాశం గల ప్రాంతాలతో కూడిన గ్రహ పటాలను సృష్టించారు. ఉప్పు నీరు త్వరగా మరగదు. గడ్డ కట్టదు. మంచినీటి మాదిరిగా అంత త్వరగా ఆవిరి కాదు. కాబట్టే ఉప్పు జలాశయాల మీద పరిశోధకులు దృష్టి సారించారు. ఉత్తర భాగాన మధ్య నుంచి ఎగువ అక్షాంశాల్లో, దక్షిణార్ధగోళంలోని భారీ బిలాల్లో ఉప్పు నీటికి అనువైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన విన్సెంట్‌ చెవ్‌రియర్‌ చెబుతున్నారు. అంగారక మధ్య రేఖ సమీపంలో అంతగా లోతులేని ప్రాంతాల్లోనూ ఇవి ఉండొచ్చని వివరిస్తున్నారు. అంగారకుడి మీద జీవుల అన్వేషణకు, భవిష్యత్తులో మనిషి అక్కడికి వెళ్లినప్పుడు నీటి కోసం వెతకటానికి తమ అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని ఆశిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని