close

తాజా వార్తలు

Updated : 17/12/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సుబ్రహ్మణ్యం... బ్రహ్మజ్ఞానం!

ఈ నెల 20న సుబ్రహ్మణ్య షష్ఠి

కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు, స్కందుడు, శరవణభవుడు, షాణ్మాత్రుడు, ఆర్ముగం, మురుగన్‌, దండాయుధపాణి... ఈ పేర్లతో పిలిచే కుమారస్వామి తారకాసుర సంహారం నిమిత్తం జన్మించిన శివ పుత్రుడు. పై పేర్లన్నీ ఆయన శక్తిని, మహిమను, అవతార రహస్యాన్ని తెలియజెప్పేవే. ఆయనే బ్రహ్మజ్ఞాన స్వరూపంగా ఎలా మారాడో తెలుసా?

కుమారస్వామి పసివాడుగా తల్లి ఒడిలో ఉన్న సమయంలో శివుడు పార్వతికి ప్రణవ మంత్ర అర్థాన్ని వివరించాడు. ఆమెతో పాటు కుమారుడూ ఆ మంత్రాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. దీంతో అహంకారం పెరిగింది అతనికి. దానికితోడు దేవ సేనకు నాయకత్వం రావడంతో కుమారుడి గర్వం మరింత పెరిగింది. అది ఎంత వరకు వెళ్లిందంటే... బ్రహ్మదేవునితో వాదనకు దిగి, ఆయన్నే పరీక్షించే సాహసం చేశాడు. వాదోపవాదాల అనంతరం బ్రహ్మను బంధించాడు. విషయం తెలుసుకున్న శివుడు కుమారుణ్ని పిలిచి... బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ వేరు వేరు రూపాల వారైనా అందరి శక్తులు సమాహారం సృష్టికి అత్యవసరమని వారి తత్వాన్ని చెప్పాడు. దీంతో తాను చేసిన తప్పు తెలుసుకున్న కుమారస్వామి ప్రాయశ్చిత్తం కోసం యోగ సాధన చేశాడు. ఆ సాధనలో తన శరీరంలో నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తి మేల్కొంది. అది క్రమంగా మణిపూరక, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధి చక్రాలు దాటి సహస్రారం వరకు వ్యాపించింది. అదే బ్రహ్మ జ్ఞానం. సు అంటే మంచి, బ్రాహ్మణ్యం అంటే వికాసం అని అర్థం. అందుకే బ్రహ్మజ్ఞానాన్నే సుబ్రహ్మణ్య తత్త్వం అని కూడా అంటారు.  మనిషిలో అంతర్లీనంగా ఉండే కుండలినీ శక్తి షట్చక్రాలను దాటి సహస్రారం చేరే వరకు సర్పరూపంలో మెలికలు తిరుగుతూ వ్యాపించి ఉంటుంది. అందువల్లనే సుబ్రహ్మణ్యునికి ప్రీతికరమైన మార్గశిర శుద్ధ షష్ఠి రోజు ఆలయాల్లో కార్తికేయుణ్ణి  సర్పరూపునిగా కొలుస్తారు.

* సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనం నెమలి. ఇది పురి విప్పితే  ఓంకారానికి ప్రతీక. ఆయుధం శూలం. ఇది సునిశితమైన మేధా శక్తికి ప్రతీక. వల్లీ, దేవసేనలు దేవేరులు. వీరు ఇచ్ఛా,జ్ఞాన శక్తులకు ప్రతీకలు.

* దేశంలో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆరు. ఇవన్నీ తమిళనాడు లోనే ఉన్నాయి. అవి... తిరుత్తని, పళని, స్వామిమలై,  తిరుచ్చందూర్‌, తిరుప్పర కుండ్రం, పదముదిర్‌ చోలై. తెలుగు రాష్ట్రాల్లో బిక్కవోలు, రామకుప్పం, మోపిదేవి, నాగులమడక. ఎంతో ప్రసిద్ధి పొందాయి

- రమా శ్రీనివాస్‌.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని