close

తాజా వార్తలు

Published : 31/12/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నమాజుకు పదండి!

ఇస్లాం సందేశం

జ్రత్‌ హాతిమ్‌ (రహ్మాలై) తన నమాజు విధానాన్ని ఇలా వివరించారు. ‘‘నమాజు కోసం అజాన్‌ పిలుపు వినగానే వుజూ చేసుకుంటాను. అనంతరం ప్రాపంచిక విషయాలన్నింటినీ త్యజించి నమాజు చేసే స్థలానికి చేరకుంటాను. అక్కడ కాసేపు మౌనంగా కూర్చుండిపోతాను. మానసిక ప్రశాంతత కుదిరాక నమాజుకోసం లేచి నిలబడతాను. నా ఎదురుగా దైవ గృహం కాబా ఉంది. నా కాళ్లకింద నరకాన్ని దాటిపోయే వంతెన పుల్సిరాత్‌ ఉంది. నా కుడివైపున స్వర్గముంది. నా ఎడమ పక్కన నరకాగ్ని ఉంది. మృత్యుదూత నా వెనుకాలే కాపుగాసి నిల్చున్నాడు. ఇదే నా చివరి నమాజు అనే స్పృహతో నమాజు ఆచరిస్తాను. మరో నమాజు చదివే సౌభాగ్యానికి నేను నోచుకుంటానో లేదోననే భావనతో నమాజులో లీనమై పోతాను.’’
‘ఇస్లాం మూల స్తంభాల్లో నమాజు కీలకమైంది. ఎవరైతే నమాజును చేస్తారో అతను ధర్మాన్ని కాపాడినట్లే. ఎవరు త్యజించారో వారు ధర్మాన్ని కూల్చినట్లే’ అని ప్రవక్త (స) చెప్పారు. రోజులో వీలైనంత సమయం మసీదులోనే గడపాలని మహనీయులు చెప్పేవారు. నమాజు ద్వారా ఎన్నో శుభాలు కలుగుతాయి. ఆరోగ్యం సిద్ధిస్తుంది.  ముఖ వర్చస్సు పెరుగుతుంది. బద్దకం దూరమవుతుంది. భౌతిక ప్రపంచంలోనూ, పరలోక రాజ్యంలోనూ ఎనలేని ప్రయోజనాలున్నాయని జాదుల్‌ మాద్‌ గ్రంథంలో ఉంది.

- ఖైరున్నీసాబేగం



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని