close

తాజా వార్తలు

Updated : 07/01/2021 07:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మతి తప్పిందని మరో పెళ్లి చేసుకున్నాడు!

భర్త వేధించడంతో కుంగిపోయా. అతడు చికిత్స పేరు చెప్పి నన్ను పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు నాకు డైవోర్స్‌ ఇవ్వకుండానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. కానీ ఆ విషయం దాచిపెట్టి విడాకుల నోటీసులు పంపాడు. పెద్దలు అడిగితే...మతిస్థిమితం లేని మహిళతో కాపురం చేయక్కర్లేదని చట్టమే చెబుతోందంటున్నాడు ఇది నిజమేనా? 

- ఓ సోదరి

మీకు మతిస్థిమితం లేదని కోర్టులో నిరూపించి, విడాకులు తీసుకునేవరకూ మీ భర్తకి రెండో పెళ్లి చేసుకునే హక్కు లేదు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13 ప్రకారం విడాకులు తీసుకోవడానికి కొన్ని కారణాలు చూపించాలి. వాటిల్లో మతిస్థిమితం లేదని నిరూపించడం కూడా ఒకటి. అయితే అది కూడా శాశ్వతంగా తగ్గని మానసిక వ్యాధి అయి ఉండాలి. దీనివల్ల భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జీవించలేని పరిస్థితులు ఉన్నాయని నిరూపించగలగాలి. ఇవేమీ లేకుండా, విడాకులు తీసుకోకుండా...అతడు రెండో పెళ్లి చేసుకుంటే అది చెల్లదు. అందుకు మీరు అతడిపై కేసు పెట్టొచ్చు.  మంచి లాయర్‌ని సంప్రదించండి మీ సమస్య పరిష్కారమవుతుంది.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని