close

తాజా వార్తలు

Published : 06/01/2021 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి?

నా వయసు 43. ఎత్తు అయిదడుగుల నాలుగు అంగుళాలు. బరువు 70 కిలోలు. నా సమస్య ఏమిటంటే... చేతులు, కాళ్లు సన్నగా ఉంటాయి. పొట్ట మాత్రం చాలా ఎత్తుగా ఉంటుంది. అది తగ్గడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?  

- రాణి, హైదరాబాద్‌

శారీరక శ్రమ లేకపోవడం, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో గంటల కొద్దీ కూర్చొని ఉండటం, ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల మహిళల్లో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావడానికి మీరేం చేయాలంటే... రోజూ ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి.  అరగంటైనా శారీరక శ్రమ చేయాలి. వారానికి మూడుసార్లు ఏరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌లు, మిగతా రెండు రోజులు బరువులు ఎత్తే, శక్తినిచ్చే వ్యాయామాలను కచ్చితంగా చేయాలి. ఆహారం విషయానికి వస్తే.... చక్కెర, బెల్లం, స్వీట్స్‌, కేక్స్‌.... లాంటి తేలికగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్ల వాడకం తగ్గించాలి.  పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే పాలిష్‌ బియ్యం, అటుకులు తగ్గించాలి. వీటి స్థానంలో తాజా కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. అన్నం మాత్రమే తినాలనుకుంటే తీసుకుంటున్న మొత్తాన్ని కాస్త తగ్గించి, ఆ స్థానంలో పప్పుదినుసులు, గుడ్డు, సోయా నగ్గెట్‌్్స, ఆకుకూరల వినియోగం పెంచాలి. మీ ఆహారంలో ఒక పూట తృణధాన్యాలు (జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు) వాడటం మొదలుపెట్టండి. మరోపూట పూర్తిగా పప్పుదినుసులతో మాత్రమే చేసిన పదార్థాలను (పెసరట్టు, అడై, గుగ్గిళ్లు లాంటివి) తీసుకోండి. ఇలా మూడు నెలలపాటు చేస్తే మీ పొట్ట తగ్గుతుంది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని