close

తాజా వార్తలు

Published : 22/01/2021 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దానిమ్మతో దిగులు దూరం!

నాకిప్పుడు మూడోనెల. మనసంతా దిగులుగా ఉంటోంది. నిద్రలేచే సరికి వికారం, వాంతులు. ఏదీ తినా లనిపించట్లేదు. ఇలా అయితే కడుపులో బిడ్డ సంగతేంటని  బాధపడుతున్నా. నేను అన్నీ తినాలంటే ఏమన్నా మార్గముందా?

- సుధ, నిజామాబాద్‌

ర్భిణులు తొలి మూడునెలల్లో వికారం, వాంతులతో సతమతమవడం సహజం. హార్మోన్లలో వచ్చే మార్పులే ఇందుకు కారణం. అయితే వీటి ప్రభావం కడుపులో బిడ్డ ఎదుగుదలపై చాలా తక్కువగా, అరుదుగా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటప్పుడు కంగారు, ఆందోళన పడకూడదు. మీరు ఒకేసారి కాకుండా కొంచెంకొంచెంగా ఎక్కువసార్లు తినండి. నూనెలో వేయించినవి వికారాన్ని పెంచుతాయి. త్వరగా జీర్ణం కావు. తేలికగా జీర్ణమయ్యే సొర, పొట్ల, బీరకాయలు వంటి కాయగూరలు తినండి. వీటిలోని పోషకాల వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యం కుదుటపడుతుంది. దానిమ్మ రసం తాగితే వికారం తగ్గుతుంది.  కప్పు దానిమ్మ రసాన్ని రోజూ తీసుకోండి. కమలా పండ్లు కూడా మంచివే. చెంచా అల్లం రసం, రెండు చెంచాల ఉసిరి రసం, చెంచాడు తేనె కలిపి పరగడుపున తీసుకున్నా మంచిది. కప్పు చొప్పున నిమ్మరసం, అల్లం రసానికి రెండు కప్పుల చక్కెర లేదా పటికబెల్లం పొడి కలిపి మూడింటినీ గిన్నెలో పోయాలి. చక్కెర కరిగేలా గరిటెతో బాగా కలుపుతూ తీగపాకం వచ్చేవరకు వేడిచెయ్యాలి. కాచి చల్లార్చిన ఈ మిశ్రమాన్ని పొడి గిన్నె లేదా సీసాలో భద్రపరుచుకోవాలి. రోజులో మూడు లేదా నాలుగుసార్లు రెండు చెంచాల చొప్పున తీసుకుంటే వికారం తగ్గి ఉపశమనంగా ఉంటుంది. మీకు నచ్చినవి తినగలుగుతారు. 



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని