close

తాజా వార్తలు

Published : 14/02/2021 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇరుగుపొరుగుకు ఇంటిగుట్టు చెబుతోంది!

మా అత్తగారిది విచిత్రమైన మనస్తత్వం. నాకూ, మావారికి మధ్య ఏదో ఒక గొడవ పెడుతుంది. ఇంటి విషయాలను పనివాళ్లు, ఇరుగుపొరుగు దగ్గర చెబుతోంది. ఇలా చేయడం పద్ధతి కాదని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. తనని ఎలా మార్చాలి?    

- నిత్య

మీ అత్తగారికి అభద్రతా భావం ఎక్కువనిపిస్తోంది. ఎదుటివారి దృష్టి ఆమెపైనే ఉండాలనీ, తనకున్న ఇబ్బందులను వారు గుర్తించి సానుభూతి చూపాలని కోరుకునే మనస్తత్వం ఆమెది.  ఎదుటివారే తనని అన్ని రకాలుగా అర్థం చేసుకోవాలనే మానసిక స్థితిలో ఆమె ఉన్నట్లు అర్థమవుతోంది. తను ఇలా ప్రవర్తించడానికి బోలెడు కారణాలుండొచ్చు. చిన్నతనంలో ఆమె పట్ల కుటుంబ సభ్యులు  ప్రవర్తించిన తీరు, పెళ్లయ్యాక భర్తా, అత్తమామల నిరాదరణ...  ఇవన్నీ ఆమె వ్యక్తిత్వం మారడానికి కారణం కావొచ్చు. దాంతో తనకు తెలియకుండానే ఆమెలో ఒకరకమైన సంకుచితమైన ఆలోచన విధానం పెరిగి ఉండొచ్చు.  భర్త చనిపోవడం, కొడుకులు, కోడళ్లు తనని సరిగా చూసుకోరేమోననే అపోహా, అభద్రతతో ఇతరుల సానుభూతి పొందడానికి ఇలా ప్రవర్తిస్తున్నారు. తను ఈ వయసులో మారడం చాలా కష్టం. కాబట్టి మీరే కాస్త సర్దుకుపోవాలి. తనని అర్థం చేసుకోండి. తనతో మంచిగా మాట్లాడుతూ ఆమె ఏ విషయాల్లో అభద్రతకు గురవుతుందో తెలుసుకుని వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని