close

తాజా వార్తలు

Updated : 28/02/2021 02:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాసా... ఆమె పేరుతో!

‘హిడెన్‌ఫిగర్స్‌’...  అమెరికాలో శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి కోసం కృషి చేసిన నల్లజాతి మహిళలపై మార్గట్‌లీ రాసిన పుస్తకం ఇది. తర్వాత సినిమాగా కూడా వచ్చింది. ఇందులో ప్రధాన పాత్ర మేరీ డబ్ల్యూ జాక్సన్‌ అనే మహిళా శాస్త్రవేత్తది. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే... వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కేంద్రానికి ఆమె పేరునే పెట్టారు. నాసాలో ఉద్యోగినిగా అడుగుపెట్టిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళా ఇంజినీర్‌ ఆమె. నల్లజాతీయురాలిగా ఎన్నో సవాళ్లని ఎదుర్కొంటూనే... తన కెరీర్‌లో ఎనలేని విజయాలని సాధించారామె. హ్యాంప్టన్‌ యూనివర్సిటీ నుంచి  డిగ్రీ చేసిన తర్వాత ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ చదివిన మేరీజాక్సన్‌ నాసాలో నేషనల్‌ అడ్వైజరీ కమిటీ ఫర్‌ ఏరోనాటిక్స్‌ విభాగంలో ఉద్యోగినిగా తన కెరీర్‌ని మొదలుపెట్టారు. పదవీ విరమణ పొందేవరకూ అదేవిభాగంలో పనిచేసిన మేరీ అనేకమంది వ్యోమగాములని అంతరిక్షంలోకి పంపడంలో కీలక పాత్ర వహించారు. 35 ఏళ్ల తన సేవలకు గుర్తింపుగానే ఇప్పుడు నాసా ప్రధాన కేంద్రానికి ఆమె పేరుని పెట్టారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని