close

తాజా వార్తలు

Published : 12/03/2021 00:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒత్తిడికి...గులాబీ స్నానం!

స్నానంతో ఒంటిమీద మురికి తొలగాలి. చర్మానికి నిగారింపు కావాలి. అన్నింటికీ మించి అలసట, ఒత్తిడి వంటివి అదుపులోకి రావాలి. అందుకోసం ఇలా ప్రయత్నిం చండి.
పావుకప్పు నువ్వుల నూనె తీసుకుని దానిలో రెండు చుక్కల లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ చేర్చండి. దీన్ని ఒంటికి,   తలకు రాసుకుని మర్దనా చేయండి. అరగంటయ్యాక పావుకప్పు గులాబీరేకల ముద్దకు చెంచా తేనె కలిపి ఒంటికి రాసుకుని పూతలా వేసి కాసేపు ఆరనివ్వండి. చివరగా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. దీనివల్ల శరీరం తేలికపడుతుంది. జుట్టు నిగారింపుతో కనిపిస్తుంది.
* గుప్పెడు గులాబీరేకల్ని రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగించాక వడకట్టి చల్లార్చాలి. దానికి చెంచా పెసరపిండి,  రెండు చుక్కల టీట్రీ ఆయిల్‌ కలిపి  ఒంటికి రాయండి. లేదా కాస్త గులాబీ రేకల ముద్దకు చెంచా పంచదార, కాస్త పాలు కలిపి ఒంటికి రాసుకుని ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చర్మానికి తగిన తేమ అంది మెరిసిపోతుంది...ఒత్తిడీ ఇట్టే దూరమవుతుంది.
* గులాబీ పూలని పేస్ట్‌ చేసి...దానిలో కొద్దిగా కొబ్బరి పాలు, పంచదార, చెంచా తేనె కలిపి ఒంటికి రాసుకోవాలి. పావుగంటాగి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. దీనివల్ల చర్మంపై మృతకణాలు తొలగి...కాంతివంతంగా కనిపిస్తుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్