close

తాజా వార్తలు

Published : 11/04/2021 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మొటిమల్ని తగ్గించే టొమాటో ప్యాక్‌!

మట్టిలో ఎన్నో ఖనిజలవణాలు ఉంటాయి. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ ఎనర్జ్జీ ఉంటుంది. ఇలాంటి మట్టితో తయారు చేసిన కుండలో నీటిని నిల్వచేయడం వల్ల ఆ ప్రయోజనాలన్నీ వాటర్‌లోకి చేరతాయి. ఇందులోని నీళ్లను వేసవిలో తాగితే కోల్పోయిన శక్తిని తిరిగి పొందటమే కాదు...డీహైడ్రేషన్‌ బారినపడరు.

ముఖంపై ముత్యమంత మొటిమ కనిపించినా బాధపడిపోతారు అమ్మాయిలు. ఇలాంటప్పుడు అందుబాటులో ఉండే ఈ పదార్థాలతో చేసిన ఈ ప్యాక్‌లను వేసి చూడండి. మీ సమస్య దూరమవుతుంది.
రెండు చెంచాల జామ పండు గుజ్జులో ఓ అరటిపండును వేసి బాగా మెదపండి. దానికి చెంచా తేనె చేర్చి ముఖానికి పూతలా వేయండి. వీటిలోని విటమిన్‌ ఎ, సి అలానే లైకోపిన్‌తో పాటు యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మొటిమలు, వాటి తాలూకు మచ్చల్ని తగ్గిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

*  పావుకప్పు టొమాటో గుజ్జులో చెంచా పెరుగు కలపండి. దాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరి. చర్మం శుభ్రపడుతుంది. మొటిమలూ క్రమంగా తగ్గుముఖం పడతాయి.
* నిమ్మరసం, రోజ్‌ వాటర్‌లను సమపాళ్లలో కలిపి ఫేస్‌కి రాయాలి. ఆరాక చన్నీళ్లతో కడిగేస్తే సరి. ఇలా నాలుగు వారాల పాటు చేస్తే మొటిమల సమస్య పరిష్కారమవుతుంది.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని