close
Array ( ) 1

తాజా వార్తలు

ఏ ఉప్పు ఎందుకంటే...

పదార్థానికి రుచి రావాలన్నా, పోవాలన్నా... ఉప్పుతోనే సాధ్యం. అలాంటి ఉప్పు ఏ రకాల్లో లభిస్తోందో, దానివల్ల కలిగే లాభాలేంటో చూద్దామా..

* టేబుల్‌ సాల్ట్‌: మనలో తొంభైశాతం మంది వాడేది ఇదే. పదార్థాల్లో సులువుగా కలిసిపోతుందిది. ఈ ఉప్పు నుంచి అయోడిన్‌ అందుతుంది. అందరూ వాడేదే అయినా... దీంట్లో కొన్ని రకాలూ ఉన్నాయి.
* కోషర్‌ సాల్ట్‌: దీన్ని కల్లుప్పు లేదా రాళ్లుప్పు అంటారు. ఇందులో అయోడిన్‌ని అదనంగా జతచేయరు. దీన్ని పదార్థాల్లో కలిపినప్పుడు ఉప్పు రుచే వస్తుంది. ఈ ఉప్పును నిత్యం తీసుకోవడం వల్ల సోడియం శాతం చాలా తక్కువగా అందుతుంది. అధికరక్తపోటు సమస్యా అదుపులో ఉంటుంది.   చేపల్ని శుభ్రం చేయడానికి ఈ ఉప్పు సరైన ఎంపిక. వాసన వదులుతుంది. పొలుసు సులువుగా పోతుంది.
* సీసాల్ట్‌: సముద్రపు నీటిని ఆవిరిపట్టి దీన్ని తయారుచేస్తారు. ఇది పదార్థాల్లో అంత త్వరగా కరగదు. ఇందులో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, ఇనుము, జింక్‌, అయోడిన్‌ శాతం ఎక్కువ. దీన్ని ఒక చెంచాకు మించి తీసుకోకూడదు.
* సోడియం తక్కువగా ఉండే ఉప్పు: అధికరక్తపోటుతో బాధపడేవారికి ఇది సరైన పరిష్కారం. సాధారణ ఉప్పుతో పోలిస్తే... ఇందులో సోడియం ముప్పైశాతం తక్కువగా ఉంటుంది. ఇది మంచిదే కానీ... పదార్థానికి రుచి రావడానికి దీన్ని ఎక్కువగా వాడాల్సి వస్తుంది.
* పింక్‌ సాల్ట్‌: దీన్ని హిమాలయన్‌ రాక్‌సాల్ట్‌ అనీ అంటారు. ఇందులో ఖనిజాల మోతాదు ఎక్కువ. ఇది కండరాల నొప్పుల్ని నివారిస్తుంది. శరీరమంతటికీ రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. కేవలం ఆహారంలోనే కాదు, స్నానానికీ దీన్ని వాడతారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.