close
Array ( ) 1

తాజా వార్తలు

ఇంజినీర్లకు పవర్‌ డిప్లొమా!

ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు నేషనల్‌ పవర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌పీటీఐ) మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. పవర్‌ సిస్టమ్స్‌పై పట్టు సాధించేందుకు ఒక పీజీ డిప్లొమాను ప్రవేశపెట్టింది. ఇరవై ఆరు వారాల వ్యవధి ఉండే ఈ కోర్సును పూర్తిచేస్తే విద్యుత్తు రంగంలో ఉద్యోగం పొందవచ్చు.

పారిశ్రామిక రంగం విస్తరిస్తోంది. విద్యుత్తు అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎలక్ట్రికల్‌ సెక్టార్‌లో సంస్కరణలు వస్తున్నాయి. దీంతో తగిన నిపుణులకు డిమాండ్‌ ఎక్కువైంది. ఆ అవకాశాలను అందుకోవాలంటే అభ్యర్థులు కొన్ని ప్రత్యేకమైన కోర్సులు చేయాలి. అలాంటి వాటిలో ఒకటైన పీజీ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌కు నోటిఫికేషన్‌ వెలువడింది. సాంకేతికంగా, వృత్తిపరంగా విద్యుత్తు సంస్థలకు కావాల్సిన నిపుణులను సిద్ధం చేయడమే ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం. ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్‌ పాసైనవారు దీనిలో చేరడానికి అర్హులు. వయసు పరిమితి లేదు. అర్హతలు, ఆసక్తి ఉంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఎలా?
సంస్థ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకొని పూర్తిచేసి పంపాలి. నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా ఉంటుంది. కోర్సులో 60 శాతం థియరీని బోధిస్తారు. 40 శాతం ప్రాక్టికల్‌ శిక్షణ ఉంటుంది. సీట్ల సంఖ్య 60. రిజర్వేషన్లు వర్తిస్తాయి.

రెసిడెన్షియల్‌ అభ్యర్థులకు కోర్సు ఫీజు సంవత్సరానికి మొత్తం రూ. 2,13,100 వరకు అవుతుంది. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా అభ్యర్థి ఉద్యోగాన్ని పొందితే అదనంగా రూ. 15వేలు ప్లేస్‌మెంట్‌ ఫీజు కట్టాలి. వాయిదాల్లో చెల్లించవచ్చు. అర్హులకు రుణసదుపాయమూ ఉంది. నాన్‌-రెసిడెన్షియల్‌ విద్యార్థులకు సంవత్సరానికి మొత్తం రూ. 1,86,000 ఫీజు అవుతుంది. ప్లేస్‌మెంట్‌ రుసుం అదనం. విద్యుత్తు సంస్థలు/ కార్పొరేషన్లలో పనిచేస్తూ తగిన అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా కోర్సులో చేరవచ్చు. వీరిలో రెసిడెన్షియల్‌ అభ్యర్థులకు ఏడాదికి రూ. 2,57,200, నాన్‌-రెసిడెన్షియల్‌ వారికి రూ. 2,39,200 ఫీజు ఉంటుంది.


ఉద్యోగావకాశాలు

ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులను బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, విండ్‌ వరల్డ్‌ ఇండియా లిమిటెడ్‌, అర్కాడిస్‌, తోషిబా ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌, జేవీఎస్‌ ఎలక్ట్రానిక్స్‌, నేషనల్‌ కాంట్రాక్టింగ్‌ కంపెనీ, అట్కిన్స్‌ గ్లోబల్‌, కేఈసీ, కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ, అడానీ పవర్‌, కల్‌కైటెక్‌, సుజ్లాన్‌, జెనస్‌ పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ, మనవ్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అబ్లమ్‌ ఎలక్ట్రిక్‌, విజయ్‌ ఎలక్ట్రికల్స్‌, టీమ్స్‌ ఇండియా టవర్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓపెన్‌ సిస్టమ్స్‌ ఇంటర్నేషనల్‌, స్విడ్జర్‌ ఇంజినీరింగ్‌ ల్యాబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మనికరన్‌ పవర్‌ మొదలైన సంస్థల్లోకి తీసుకుంటున్నారు.
చిరునామా: నేషనల్‌ పవర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, సుబ్రమణ్యపురమ్‌ రోడ్‌, బనషంకరి - 11 స్టేజ్‌, యర్రబ్‌నగర్‌ బస్టాప్‌ దగ్గర, బెంగళూరు- 560 070.
ఈ-మెయిల్‌:pstinpti@yahoo.com
వెబ్‌సైట్‌: www.nptibangalore.in
దరఖాస్తుకు చివరి తేదీ: 22.11.2019
కౌన్సెలింగ్‌, ప్రవేశం తేదీలు: డిసెంబరు 3, 4, 5
కోర్సు ప్రారంభ తేదీ: 09.12.2019


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.