close
Array ( ) 1

తాజా వార్తలు

అటు రక్షణ.. ఇటు రాబడి

ర్మ్‌ పాలసీలకు చెల్లించిన ప్రీమియం తిరిగి రాదనుకుని, కొంతమంది వీటిని తీసుకోవడానికి ఆసక్తి చూపించరు. ఇలాంటి వారినీ ఆకర్షించేందుకు ఏగాన్‌ లైఫ్‌ వినూత్న పాలసీతో ముందుకొచ్చింది. తన ‘ఐటర్మ్‌’ పాలసీకి కొన్ని అదనపు ప్రయోజనాలను జోడించింది. సాధారణంగా టర్మ్‌ పాలసీ తీసుకున్నప్పుడు దాని వ్యవధి ముగిసే వరకూ పాలసీదారుడికి ఏదైనా జరిగితే పరిహారం అందుతుంది. లేకపోతే చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు. ఈ కొత్త పాలసీలో వ్యవధి వరకూ రక్షణ కొనసాగుతుంది. గడువు పూర్తయ్యాక పాలసీ విలువలో నెలనెలా 0.1శాతం వెనక్కి ఇస్తుంటారు. ఇలా మొత్తం 100 ఏళ్ల వయసు వచ్చేదాకా ఈ చెల్లింపు కొనసాగుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల పొగతాగని వ్యక్తి 100 ఏళ్ల వ్యవధిని ఎంచుకొని, రూ.కోటి పాలసీ తీసుకున్నాడనుకుందాం. ఏ ఇబ్బందీ లేకుండా చివరి వరకూ పాలసీ కొనసాగించాడనుకుందాం. అతనికి 60 ఏళ్లు వచ్చినప్పుడు ఒకేసారి రూ.5లక్షలు చెల్లిస్తుంది. ఆ తర్వాత నుంచి నెలకు రూ.10,000 (రూ.కోటిలో 0.1శాతం) చొప్పున అతను మరణించే వరకూ (గరిష్ఠంగా 100 ఏళ్ల వయసు) చెల్లిస్తుంది. ఇదే కాకుండా సాధారణ టర్మ్‌ పాలసీలో ఒకేసారి పరిహారం వచ్చేలా కూడా ఎంచుకోవచ్చు. ఇందులో డ్యూయల్‌ ప్రొటెక్ట్‌, లైఫ్‌ ప్రొటెక్ట్‌, ప్రొటెక్ట్‌ అనే ఐచ్ఛికాలూ ఉన్నాయి. పాలసీ తీసుకునేప్పుడు పొగతాగిన వ్యక్తులు, ఆ తర్వాత దాన్ని మానేస్తే.. ప్రీమియం రేటులో తగ్గింపు లభిస్తుంది. ఏటా లేదా జీవితంలోని వివిధ దశలను బట్టి పాలసీ మొత్తాన్ని పెంచుకోవడంలాంటివీ ఇందులో ఉన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.