close
Array ( ) 1

తాజా వార్తలు

చూసి కాదు... ధరించాకే కొనండి!

ఈ యాప్‌ ఆన్‌లైన్‌ వినియోగదారులకోసం

ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనేటప్పుడు బాగానే కనిపిస్తుంది. దగ్గరొచ్చాకే మనం అనుకున్నట్ల్లుగా ఉండకపోవచ్చు. ఇలాంటి సమస్యల్ని గమనించిన అమృతవల్లి... ఓ సంస్థను ప్రారంభించింది. యాప్‌ సహాయంతో వస్తువు మనకు నప్పుతుందో లేదో తెలుసుకునే సాంకేతికను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే...

మా స్వస్థలం కడప. అక్కడే డిగ్రీ వరకు చదువుకొని తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి ఎంసీఏ పూర్తి చేశా. గోల్డ్‌ మెడల్‌ అందుకున్నా.  మా నాన్న పచ్చిపులుసు సీతారామయ్య ప్రముఖ న్యాయవ్యాది. చదువైపోయాక విప్రో, టాటాడొకామో వంటి సంస్థల్లో దాదాపు పాతికేళ్లు పనిచేసిన అనుభవం ఉంది. నాకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి... సమాజానికి ఏదైనా చేయాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఇటీవల డిజిటలైజేషన్‌ పెరిగిపోయింది. యువత దుకాణాల్లోకి వెళ్లి వస్తువులు కొనుక్కోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఏదీ కావాలన్నా ఆన్‌లైన్‌లోనే వెతుక్కుంటున్నారు. ఎంత ధర పెట్టడానికైనా వెనుకాడటంలేదు. ఈ క్రమంలోనే వాళ్లకు సమస్యలు ఎదురవుతున్నాయి. వినియోగదారుడు ఒక వస్తువు కొనేటప్పుడు దాన్ని ఒకలా ఊహించుకుంటాడు. అది అతడి చేతుల్లోకి వచ్చాక ఊహించినట్లుగా ఉండకపోవచ్చు. కొంతమంది ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసి, తమకు నప్పలేదని వెనక్కి పంపించే సందర్భాలూ ఉంటాయి. ఇవనే కాదు... ఫర్నిచర్‌, పెయింటింగ్స్‌, వాల్‌పేపర్లు... వంటివీ ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తుంటారు. కొన్నిసారు వీటివిషయంలోనూ  సమస్య ఎదురవుతుంది. అనుకున్నట్లుగా ఉండక, నప్పక వెనక్కి ఇచ్చేస్తారు. ఈ క్రమంలో ఎంతోమంది శ్రమ వృథా అవుతుంది. అనుకున్న వస్తువు రాలేదని వినియోగదారుడు నిరాశ చెందితే... కొరియర్‌, ఇతర ఖర్చులతో వ్యాపారం చేసేవాళ్లకీ నష్టం జరుగుతుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకునే మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ‘పర్పుల్‌యాపిల్‌ ఇన్ఫోసిస్టం’ అనే స్టార్టప్‌ను మూడేళ్లక్రితం దిల్లీలో ప్రారంభించా. అంతకన్నా ముందు మూడేళ్లపాటు అధ్యయనం చేశా. ఆ తరువాతే ట్రైబీ4యూబై అనే యాప్‌నీ అందుబాటులోకి తెచ్చా. వినియోగాదారులు, వ్యాపారవేత్తల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఒక్కో ఫీచర్‌ను మెరుగుపరుస్తూ ముందుకు వెళ్లా. ఇది కృత్రిమ మేథస్సుతో పనిచేస్తుంది.

ఇది ఎలా పనిచేస్తుందంటే...
వినియోగదారుడు కొనాలనుకున్న వస్తువు తనకు నప్పుతుందో లేదో ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఒక నగ కొనాలనుకుంటే... ఈ యాప్‌లోకి వెళ్లి దాన్ని గమనించుకోవచ్చు. ఒక నగ లేదా కమ్మల్ని దీని సాయంతో ప్రయత్నించొచ్చు. ఆ నగ పరిమాణం ఎలా, ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అంటే.. నేరుగా దుకాణానికి వెళ్లి ప్రయత్నించినట్లే ఉంటుంది. కావాలనుకుంటే ఆ సైజును పెంచుకుని, బాగుందనుకుంటే అలానే ఆర్డరివ్వొచ్చు. నగలనే కాదు... కళ్లజోళ్లు, గృహాలంకరణ వస్తువులు... ఇలా అన్నింటినీ ఇదేవిధంగా గమనించుకోవచ్చు. ప్రస్తుతం యాప్‌సేవలు ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. నేను ఈ సంస్థను, యాప్‌నీ నా సొంత డబ్బుతోనే ప్రారంభించినా..  కొన్ని సమస్యలు తప్పలేదు. ఇది అంకురం, వినూత్న ఆలోచన కాబట్టి... చాలామంది నాతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించలేదు. వ్యాపారస్తులకూ దీని గురించి అర్థమయ్యేలా చెప్పడానికి సమయం పడుతోంది. ఇప్పుడిప్పుడే వినియోగదారులు పెరుగుతున్నారు. సంస్థలూ మా సేవల్ని ఉపయోగించుకోవడానికి ముందుకొస్తున్నాయి. సాంకేతిక రంగం నుంచి వచ్చినా... ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నా. నా ప్రయత్నం వెనుక మా వారు, కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉంది...’  అని చెబుతుంది అమృతవల్లి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.