close
Array ( ) 1

తాజా వార్తలు

ఎన్నో సమస్యలకు... ఒక్క లేజర్‌ చాలు

చర్మ సంరక్షణలో ఇప్పుడు లేజర్‌ చికిత్స ఓ భాగమైపోయింది. అసలు దీని ప్రత్యేకత ఏంటీ... ఏ సమస్యలకు లేజర్‌ని ఎంచుకోవచ్చు... ఇందులో ఉన్న రకాలేంటో తెలుసుకుందామా.

యసు పెరిగే కొద్దీ వచ్చే మచ్చలు, గుంతలు, గీతలు, ముడతలు, అవాంఛిత రోమాలు మొదలు ఎన్నో సమస్యల్ని లేజర్‌ నివారిస్తుంది. ఫలితం మాత్రం వయసు, చర్మం తత్వం... వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. లేజర్‌ని అబ్లేటివ్‌ లేదా నాన్‌ అబ్లేటివ్‌ రకాల్లో చేస్తారు. అబ్లేటివ్‌ లేజర్స్‌లో కార్బన్‌ డయాక్సైడ్‌(సీవో2) లేదా ఎర్బియం ఉంటుంది. సీవో2ని మచ్చలు, ముడతలు, పులిపిర్లు... వంటివి తొలగించేందుకు ఉపయోగిస్తారు. ఎర్బియం విధానాన్ని సన్నటి గీతలు, ముడతలు వంటివాటికి వాడతారు. దీనిలో చర్మంపై ఉన్న బయటి పొరని తొలగిస్తారు. సమస్యను బట్టి ఎన్ని విడతల్లో చేయాలనేది వైద్యులు నిర్ణయిస్తారు. దుష్ప్రభావాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ముదురు రంగు చర్మతత్వం ఉన్నవారికి జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. నాన్‌ అబ్లేటివ్‌ లేజర్‌ చికిత్సలో చర్మపొరల్ని తొలగించరు. దీనిలో పల్స్‌డ్‌ డై, ఫ్రాక్షనల్‌... వంటివి ఎక్కువగా వినియోగిస్తారు. వీటిని రొజీషియా, స్పైడర్‌ వైన్స్‌, యాక్నే సంబంధిత సమస్యలకు పరిష్కారంగా వాడతారు. దుష్ప్రభావాలు తక్కువ. ఎక్కువ విడతల్లో చికిత్స చేయాల్సి ఉంటుంది. 

ఏ సమస్యలకు ఏ లేజర్‌ అంటే...

సన్నటి గీతలు- ముడతలు: వీటికి స్కిన్‌ రీసర్ఫేసింగ్‌, స్కిన్‌ టైటనింగ్‌ పద్ధతుల్ని... ఒకటి లేదా రెండింటినీ కలిపి అబ్లేటివ్‌ లేజర్‌లో భాగంగా చేస్తారు. అంటే సీవో2 లేజర్‌ లేదా ఎర్బియం యాగ్‌ వాడతారు. కొన్నిసార్లు ఐపీఎల్‌, ఎల్‌ఈడీ, ఫొటోఫేషియల్స్‌ పల్స్‌డ్‌డై లేజర్స్‌నీ ఎంచుకుంటారు.

స్కిన్‌ టైటనింగ్‌: అన్నిరకాల లేజర్‌ చికిత్సల్లో  చర్మం కొంతవరకూ బిగుతుగా మారుతుంది. కొలాజిన్‌ ఉత్పత్తిని పెంచడానికి సీవో2 ఎంచుకుంటారు. దీంతోపాటు టైటన్‌ ఇన్‌ఫ్రారెడ్‌ డివైజ్‌, థర్మేజ్‌ రేడియో ఫ్రీక్వెన్సీ... వంటివీ ఎంచుకుంటే ఫలితం బాగుంటుంది. 

పిగ్మెంటేషన్‌: సాధారణంగా లేజర్‌ చికిత్సల్ని ఎక్కువగా పిగ్మెంటేషన్‌కి వాడుతుంటారు. సన్‌ స్పాట్స్‌, ఏజ్‌ స్పాట్స్‌, మెలస్మా... ఇతర హైపర్‌ పిగ్మెంటేషన్‌ లక్షణాలకు పల్స్‌డ్‌ డై, ఎన్‌డీయాగ్‌, ఫ్రాక్షనల్‌ లేజర్స్‌ని వాడుతుంటారు. వీటితో పాటు ఐపీఎల్‌ చికిత్సనీ ఎంచుకుంటారు. ముఖం మీద నల్లమచ్చలు మంగు వంటివి తగ్గించడానికి 2 స్విచ్డ్‌ రూబీ లేదా 2 స్విచ్డ్‌ అలెగ్జాండ్రీ లేజర్‌ని వినియోగిస్తారు. కళ్లకింద నలుపు తగ్గడానికి రూబీ లేజర్‌ని వాడొచ్చు. 

టాటూలు: వీటిని తొలగించడంలో సీవో2, ఎన్డీ యాగ్‌లు కీలకంగా పనిచేస్తాయి. అయితే ఆ మచ్చ వందశాతం పోదు. 

యాక్నే స్కార్స్‌: ఈ సమస్య చర్మం లోపలి పొరలవరకూ ఉంటే సీవో2 లేజర్‌, ఎర్బియం యాగ్‌, ఫ్రాక్షనల్‌ లేజర్‌... వంటివి చేస్తారు. అవాంఛిత రోమాలను తొలగించడానికి ఒక్క సిట్టింగ్‌లో మీరాడ్రై లేజర్‌ని ఎంచుకుంటారు.

దుష్ప్రభావాలు: చికిత్స చేసినప్పుడు ఆ తరువాత కొద్దిగా నొప్పి, వాపు, చర్మం ఎర్రగా మారడం వంటి సమస్యలు మామూలే. ఇవి ఒక రోజు నుంచి వారం వరకూ ఉండొచ్చు. కొద్దిమందితో మాత్రమే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ఇబ్బందిపెడతాయి. తాత్కాలికంగా చర్మంపై తెలుపు, నలుపు రంగు మచ్చలు ఎదురవుతాయి. చాలా తక్కువ మందిలో ఈ మచ్చలు శాశ్వతంగా ఉండిపోతాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.