close
Array ( ) 1

తాజా వార్తలు

నవ వత్సరానికి.. ఆర్థిక స్వాగతం

రెండు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. మిన్నంటే సంబరాలతో 2020కి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఈ సంతోష సమయంలో కాస్త మన ఆర్థిక ప్రణాళికనూ ఒకసారి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా.. ఆర్థిక ఆరోగ్యం బాగుంటేనే.. మన భవిష్యత్తంతా బంగారం అవుతుంది.. కాబట్టి, రాబోయే ఏడాదిలో మన ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది? దాని కోసం ఏం చేయాలనే సంగతులను నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు..

తంలో చేసిన ఆర్థిక పొరపాట్లు.. కచ్చితంగా మన భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. వాటిని సరిచేసుకుంటూ.. కొత్తగా తప్పులు చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడులు, జీవిత, ఆరోగ్య బీమా, ఆదాయపు పన్ను విషయాల్లో ఈ ఏడాదిలో ఏం చేయాలో చూద్దామా..


బీమా..  తీసుకున్నారా?

కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా కల్పించే జీవిత బీమా పాలసీలను ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. ఇప్పటికీ పాలసీ లేకపోతే.. కొత్త ఏడాదిలో తొలి నిర్ణయం తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోవడమే కావాలి. చిన్న వయసు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే టర్మ్‌ పాలసీ తీసుకుంటే.. తక్కువ మొత్తానికే అధిక రక్షణ లభిస్తుంది. జీవిత బీమాను ఒక దీర్ఘకాలిక ఒప్పందంగా చూడాలి. ముఖ్యంగా పెట్టుబడితోపాటు, బీమా రక్షణ కోసం తీసుకునే యూనిట్‌ ఆధారిత బీమా పాలసీల్లో వీలైనంత ఎక్కువ కాలం కొనసాగాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. మీ కుటుంబానికి తగిన ఆర్థిక రక్షణ కల్పించే పాలసీలవైపే మొగ్గు చూపండి. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌తోపాటు, పాలసీదారుడికి ఏదైనా జరిగినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వడం, ఆ తర్వాత నెలనెలా కొంత చెల్లించే పాలసీలకు ప్రాధాన్యం ఇవ్వండి.

- అనిల్‌ కుమార్‌ సింగ్‌,
చీఫ్‌ ఆక్చూరియల్‌ ఆఫీసర్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.



వైవిధ్యం  ఉండనీయండి..

పెట్టుబడులు మంచి రాబడినిచ్చేలా మదుపు చేయడం ఎంత ముఖ్యమో.. అసలు తగ్గకుండా జాగ్రత్త తీసుకోవడమూ అంతే ప్రధానం. ఉన్న డబ్బంతా ఒకే పథకంలో పెట్టడం ఎప్పుడూ సరికాదు. ప్రస్తుతం ఒక పథకం గురించి తెలుసుకోవడం ఎంతో సులువు. మదుపు చేసేప్పుడు ఆయా పథకాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నించండి. కొత్త ఏడాదిలో సొంతంగా పెట్టుబడి పెట్టుకునేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అనేక యాప్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్లు కొత్త ఏడాదిలో ఆసక్తిగా కనిపిస్తున్నాయి.

- సౌరవ్‌ బసు, హెడ్‌-వెల్త్‌
మేనేజ్‌మెంట్‌, టాటా క్యాపిటల్‌


క్రెడిట్‌ స్కోరు  గమనించండి..

కొత్త రుణాలు తీసుకోవాలనుకున్నప్పుడు క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర ఎంతో కీలకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి క్రెడిట్‌ కార్డులు, రుణాలు తీసుకుంటున్న మహిళల సంఖ్య ఏడాది కాలంలో 25శాతానికి పైగా పెరిగింది. ఇది భవిష్యత్తులో మరింత పెరుగుతుందని అంచనా. మహిళల్లో పెరుగుతున్న ఆర్థిక అవగాహనకు ఇది నిదర్శనం. అప్పులు తీసుకునే విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు తాము తీసుకుంటున్న అప్పులు, క్రెడిట్‌ కార్డుల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే వారి క్రెడిట్‌ స్కోరుకు ఏ ఇబ్బందీ రాకుండా ఉంటుంది. కొత్త అప్పులు తీసుకోవడమూ సులభం అవుతుంది. మహిళా రుణగ్రహీతలు తమ క్రెడిట్‌ స్కోరును ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అవసరం అయినప్పుడు వెంటనే రుణం లభించేందుకు ఈ స్కోరు ఉపకరిస్తుందని గుర్తుంచుకోవాలి.

- సుజాత అహ్లవాట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌,
ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌.


పెట్టుబడి..  సురక్షితంగా

2019లో భారతీయ ఈక్విటీ మార్కెట్ల పనితీరు బాగుందనే చెప్పాలి. ఒక పక్క ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, జీడీపీ వృద్ధి రేటు తగ్గడంలాంటి సవాళ్లున్నా.. సెన్సెక్స్‌ 2019లో ఇప్పటి వరకూ దాదాపు 12శాతం రాబడినిచ్చింది. ఆర్థిక వృద్ధి కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతుందనేది ప్రస్తుతం ఉన్న నమ్మకం. ఈ నేపథ్యంలో పెట్టుబడి సురక్షితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. షేర్లలో మదుపు చేయాలనుకునేవారు.. నాణ్యమైన కంపెనీలను ఎంచుకోవడం మేలు. భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉండి, బ్యాలెన్స్‌ షీట్‌ పటిష్ఠంగా ఉన్న కంపెనీల షేర్ల ధరలు కాస్త అధికంగా అనిపించినా.. అవి ఇచ్చే స్థిరమైన లాభాలను చూడాలి. ఒకవేళ మార్కెట్‌ వ్యతిరేక దిశలోకి వెళ్లినా.. వీటిలో నష్టాలు కాస్త పరిమితంగానే ఉంటాయి.

- మనీశ్‌ జైన్‌,
ఫండ్‌ మేనేజర్‌, అంబిత్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌.


రుణం తగ్గాలి..  మదుపు పెరగాలి..

ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరాలంటే.. వీలైనంత వరకూ అప్పులకు దూరంగా ఉండాలి. ఉన్న అప్పులను కొత్త ఏడాదిలో తీర్చేందుకు ప్రయత్నించండి. కొత్త రుణాలు తీసుకోకుండా చూసుకోండి. ముందుగా అధిక వడ్డీ వసూలు చేస్తున్న అప్పులను వదిలించుకోండి. క్రెడిట్‌ కార్డుతో రుణాలు తీసుకోవద్దు. గృహ రుణానికీ అధిక మొత్తంలో వాయిదాలు చెల్లించి, దాన్ని తొందరగా తీర్చేసే ప్రయత్నం చేయండి. ఖర్చులు తగ్గించుకొని, పొదుపు పెంచుకునే విషయంలో కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండాలి. ఇప్పటి వరకూ మీరు ఆర్జించిన మొత్తంలో 20శాతం మదుపు చేస్తుంటే.. 2020లో దాన్ని 25-30 శాతానికి పెంచేలా చూడండి. ఇప్పటి వరకూ పొదుపు, మదుపులను ప్రారôభించకపోతే.. వెంటనే ఆ దిశగా ఆలోచించండి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ప్రజా భవిష్య నిధిలాంటి వాటిల్లో తప్పనిసరిగా జమ చేయండి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడినచ్చే మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించండి. పెట్టుబడి పెట్టేందుకు సరైన సమయం ఇప్పుడే అన్నది మర్చిపోకండి.

- హర్ష్‌ జైన్‌,
సీఓఓ, Groww


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.