close

తాజా వార్తలు

Updated : 01/01/2020 11:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్త ఏడాదిలో మారేది క్యాలెండరే..

ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. 2019కి, గత దశాబ్దానికి సెలవు చెప్పి.. కొత్త ఏడాది, దశాబ్దానికి ప్రజలంతా నూతనోత్సాహంతో ఘన స్వాగతం పలికారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా భారత క్రికెటర్లు, మాజీలు సామాజిక మాధ్యమాల్లో దేశ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా - విరాట్‌ కోహ్లీ
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా - వీరేంద్ర సెహ్వాగ్‌
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో అంతా మారిపోతుందని ఉత్సాహపడకండి. మారేది కేవలం క్యాలెండర్‌ మాత్రమే. మీ భాగస్వామి, ఉద్యోగం, లక్ష్యాలు ఏమీ మారవు. ఇది మీకు గుర్తుచేస్తున్నానంతే - హర్భజన్‌ సింగ్‌
విజయం దిశగా అడుగులు వేసేటప్పుడు ఎంతో దృఢంగా ఉండండి. మార్గం మధ్యలో ఎదురయ్యే కష్టాలు.. గెలిచిన తర్వాత వచ్చే ఆనందం కంటే ఎంతో చిన్నవి. అభిమానులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - మహ్మద్‌ షమి
మీకు, మీ ఆత్మీయులకు ఆ భగవంతుడు శాంతి, ఆనందాన్ని అందిస్తాడని ఆశిస్తున్నా. కొత్త జీవితం, ఉజ్వల భవిష్యత్తుకు స్వాగతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు - వీవీఎస్‌ లక్ష్మణ్‌
గత దశాబ్దానికి, 2019కి వీడ్కోలు. కొత్త ఏడాదికి ఘన స్వాగతం. ఈ నూతన దశాబ్దంలో ప్రపంచానికి దయ, ప్రేమను పంచడానికి మనం శ్రమించాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - సురేశ్‌ రైనా
2019 రోలర్‌ కోస్టర్ రైడ్‌లా గడిచింది. పద్మశ్రీ పురస్కారం అందుకోవడం, అరుణ్‌జైట్లీ స్టేడియంలోని స్టాండ్‌కు నా పేరు పెట్టడం‌, నేను రాజకీయాల్లోకి ప్రవేశించడం, పార్లమెంట్‌లో అడుగుపెట్టడంతో ఈ ఏడాది ముగిసింది. కానీ వీటి అన్నింటికంటే అమరులైన జవాన్ల పిల్లల బాధ్యతలు అందుకోవడం ఎక్కువ సంతోషంగా ఉంది. ఇదంతా మీరు అండగా నిలవడంతోనే సాధ్యమైంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - గౌతం గంభీర్‌

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.