close

తాజా వార్తలు

Published : 01/01/2020 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోహ్లీకి అవకాశాలు ఇచ్చాం.. అదే సంతృప్తి!

దిల్లీ: 2011 ప్రపంచకప్‌కు పటిష్ఠమైన భారత జట్టును అందివ్వడంలో టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా తాను విజయవంతమయ్యానని భారత మాజీ సారథి, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నాడు. ‘‘2008లో చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు అందుకున్నా. 2011 ప్రపంచకప్‌కు పటిష్ఠమైన జట్టును సిద్ధం చేయాలని ఆశించాం. దేవుడి దయ వల్ల మాకు ఎంఎస్‌ ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రపంచకప్‌లో టీమిండియా విజయం సాధించిడం నా క్రికెట్‌ ప్రయాణంలో అత్యుత్తమ క్షణం. మీకో విషయం గుర్తు చేయాలనుకుంటున్నా. విరాట్‌ కోహ్లీ ఈ రోజు ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్‌గా ఉన్నాడు. అతడికి మేము అవకాశాలు ఇచ్చాం. ఇది మాకు ఎంతో సంతృప్తినిచ్చింది’’ అని శ్రీకాంత్‌ తెలిపాడు.

భారత్ తరఫున శ్రీకాంత్‌ 43 టెస్టులు, 146 వన్డేలు ఆడాడు. సారథిగా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన అతడు 2008 సెప్టెంబర్‌లో టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు అందుకున్నాడు. 2012 వరకు సేవలు అందించాడు. 2008 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌ ఆరంభించిన కోహ్లీకి అతడు అవకాశాలు ఇచ్చాడు. అతడు సెలక్టర్‌గా ఉన్న సమయంలోనే 2011లో భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.