close

తాజా వార్తలు

Updated : 01/01/2020 13:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘హ్యాపీ న్యూ ఇయర్‌’

శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు

హైదరాబాద్‌: ఆనందోత్సవాల నడుమ నూతన సంవత్సంరలోకి అడుగుపెట్టాం. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా వారి వారి చిత్రాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర పోస్టర్లను కూడా విడుదల చేశారు.

‘2019లాంటి ఓ గొప్ప సంవత్సరంలో ఆశీస్సులు అందించిన దేవుడికి ధన్యవాదాలు. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న నా కుటుంబానికి, నాతో ఎప్పుడూ ఉండే నా స్నేహితులకు, వారి ప్రేమాభిమానాలతో నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికీ హ్యాపీ న్యూ ఇయర్‌ 2020.’ - మహేశ్‌ బాబు

‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను.’ - ఎన్టీఆర్‌

‘ప్రతి ఒక్కరికీ హ్యాపీఆర్‌ఆర్‌ఆర్‌ఇయర్‌. వెల్‌కమ్ 2020, ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ’ - ఆర్‌ఆర్‌ఆర్‌ టీం

‘నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, భోగ భాగ్యాలను షిర్డీ సాయి నాథుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.’ - మోహన్‌ బాబు

‘కొత్త కలలు, కొత్త ఆశలు, కొత్త కోరికలు.. ప్రతి ఒక్కరికీ చేకూరాలని, ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటున్నాను.’ - దిల్‌ రాజు

‘2020 ప్రతి ఒక్కరీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్‌ ’ - ప్రభాస్‌

‘హ్యాపీ న్యూ ఇయర్‌ 2020. ఈ ఏడాది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు చేకూరాలని కోరుకుంటున్నాను’ - రవితేజ

‘ఎంతో అద్భుతమైన 2020 ఏడాదిలో అందరి జీవితాలు వెలుగులమయం కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్‌’ - నాగార్జున

‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరిపై దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను’ - రజనీకాంత్‌

‘ఈ కొత్త సంవత్సరంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్నవారి పట్ల దయ, గౌరవం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనతోపాటు ఈ భూమ్మీద జీవిస్తున్న మూగ జీవులను కూడా జాగ్రత్తగా చూసుకుందాం.’ - అడివి శేష్‌

‘హ్యాపీ న్యూ ఇయర్‌. లవ్‌ యూ ఆల్‌. ఈ ఏడాది అందరికీ అద్భుతంగా ఉండాలని కోరకుంటున్నాను. సంతోషాన్ని పంచండి, ద్వేషాన్ని కాదు.’ - మంచు మనోజ్‌

‘గోపీచంద్‌ 28’ చిత్రబృందం తరఫున హ్యాపీ న్యూ ఇయర్‌. ఈ 2020 ప్రతి ఒక్కరికీ ది బెస్ట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.’ - సంపత్‌ నంది

‘హ్యాపీ న్యూ ఇయర్‌ టు ఆల్‌’ - హారీశ్‌ శంకర్‌

‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మున్ముందు అన్నీ మంచే జరగాలని కోరుకుంటున్నాను.’ - రష్మిక

‘ఆత్మీయులకు, స్నేహితులకు, ఇతర కుటుంబసభ్యులతోపాటు సంగీత ప్రియులకు హ్యాపీ న్యూ ఇయర్‌. మీకు ఈ ఏడాది సంతోషం చేకూరాలని కోరుకుంటున్నాను.’ - ఎ.ఆర్‌.రెహమాన్‌

‘మెగాస్టార్‌ చిరంజీవి 152 చిత్రబృందం నుంచి ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.’ - కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ

‘గడిచిన ఏడాది నా జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో విశేషాలను అందించింది. 2019లో నా ప్రయాణంలో నాకు సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. 2020లో నేను నటించబోతోన్న ‘అశ్వథ్థామ’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా అందర్నీ అలరించబోతోందని భావిస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్‌ 2020’ - నాగశౌర్య

‘జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను గడిచిన ఏడాది నాకందించింది. అలాగే నాకెన్నో పాఠాలను కూడా నేర్పించింది. హ్యాపీ న్యూ ఇయర్‌ . సంతోషంగా నువ్వు బతికి ప్రతి ఒక్కరినీ బతికించు’ - అల్లరి నరేష్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.