close

తాజా వార్తలు

Published : 01/01/2020 17:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెర్రీ, బన్నీతో మల్టీస్టారర్‌ చేస్తా

తారక్‌ నా మొదటి స్నేహితుడు

హైదరాబాద్‌: ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటుడు సాయితేజ్‌. ప్రస్తుతం ఆయన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఛాన్స్‌ వస్తే తప్పకుండా చెర్రీ, బన్నీతో మల్టీస్టారర్‌ చేస్తానని అంటున్నారు సాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా అభిమానులు అడిగిన పలు ఆసక్తికర విషయాలకు సాయి రిప్లై ఇచ్చారు.

మీరు ఎలాంటి చిత్రాలు చూడడానికి ఇష్టపడతారు?

సాయితేజ్‌: కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

‘సుబ్రహమణ్యం ఫర్‌ సేల్‌’ లాంటి మాస్‌ చిత్రాలు కావాలి?

సాయితేజ్‌: ఆ టైప్‌ సినిమాలకు కొంత విరామం తీసుకున్నాను

తారక్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి?

సాయి తేజ్‌: ఇండస్ట్రీలో మొదటి స్నేహితుడు

ఎంఎన్‌ఎం అంటే..‘మహానగరంలో మాయగాడు’ అని అర్థమా?

సాయి తేజ్‌: కొత్త సంవత్సరంలో వివరాలు చెబుతా. అప్పటి వరకూ సైలెంట్‌

ఈ దశబ్దంలో ఉత్తమ చిత్రాలేవి?

సాయి తేజ్‌: ఒకటి బాహుబలి, రెండు రంగస్థలం

సబ్జెక్ట్‌ నచ్చిన నూతన దర్శకులతో కలిసి పనిచేస్తారా?

సాయి తేజ్‌: ప్రస్తుతం ఓ కొత్త డైరెక్టర్‌తో కలిసి పనిచేస్తున్నాను. ఇంకో కొత్త డైరెక్టర్‌తో కథ గురించి చర్చిస్తున్నాను.

మల్టీస్టారర్‌లో నటించే అవకాశం ఉందా?

సాయి తేజ్‌: ఉంది. ప్రస్తుతానికి ప్రోసెస్‌లో ఉంది

పవన్‌తో ఉన్న ఈ ఫొటో చూస్తే ఏం గుర్తుకువస్తుంది?

సాయి తేజ్‌: నమ్మకం, ధైర్యం, ప్రేమ

పవన్‌ సినిమాల్లో పాటల్లో మీ ఫేవరెట్‌ ఆల్బమ్‌ ఏది?

సాయి తేజ్‌: ఖుషి, తొలిప్రేమ, తమ్ముడు, గబ్బర్‌ సింగ్‌

పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తారా?

సాయి తేజ్‌: సరైన కథ ఉంటే తప్పకుండా చేస్తా

అల్లు అర్జున్‌ సినిమా ఎప్పుడు? కనీసం ఒక పాటలోనైనా కనిపించండి?

సాయి తేజ్‌:  నేను కూడా ఆరోజు కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతానికి సంగీత్‌లలో ఎంజాయ్‌ చేస్తున్నాను.

మల్టీస్టారర్‌ చేస్తే రామ్‌ చరణ్‌తో చేస్తారా? లేక బన్నీతో చేస్తారా?

సాయి తేజ్‌: ఇద్దరితో చేస్తా

మీ సినిమాలకు డబ్బింగ్‌ చెప్పడానికి ఎంత టైం తీసుకుంటారు? ఆర్టిస్టులందరూ ఒకేసారి డబ్బింగ్‌ చెబుతారా? లేక విడి విడిగా చెబుతారా?

సాయి తేజ్‌: దయచేసి ఈ ప్రశ్నకు అడగకండి (సరదాగా)

పవన్‌కల్యాణ్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేయండి?

సాయి తేజ్‌: 100% చేస్తా

చరణ్‌తో మల్టీ స్టారర్‌ చేస్తే ఏ జోనర్‌ను ఎంచుకుంటారు?

సాయి తేజ్‌: కుటుంబ కథా చిత్రం

2019లో జరిగిన గొప్ప విశేషం ఏంటి?

సాయి తేజ్: నా సినిమాకు మీ ప్రేమాభిమానులు లభించడం

విజయ్‌, సుబ్రహ్మణ్యం ఈ రెండింటిలో బెస్ట్‌ రోల్‌ ఏది?

సాయి తేజ్: విజయ్‌, సుబ్రహ్మణ్యం ఈ రెండు నాకు జీవితాన్నిచ్చాయి. వీటిలో ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టం.

సిడ్నీ ఎప్పుడు వస్తారు?

సాయి తేజ్‌: త్వరలోనే రావాలనుకుంటున్నాను.

‘రంగస్థలం’లాంటి సినిమాతో రామ్‌ చరణ్‌ విజయాన్ని అందుకున్నారు. జోనర్‌ను నమ్ముకుని వచ్చిన సినిమాలు హిట్‌ అవుతున్న ఈరోజుల్లో స్టార్‌డమ్‌ ప్రభావం ఉందుదనుకుంటున్నారా?(దర్శకుడు దేవకట్ట ట్వీట్‌)

సాయి తేజ్‌: మీలాంటి దర్శకులు కథప్రధానంగా ఉండే స్ర్కిప్ట్‌లతో వచ్చినప్పుడు స్టార్‌డమ్‌ అనేది ఆ కథకు మరింత వన్నె తెస్తుంది.

రీమేక్‌ చేయాలంటే ఏ సినిమా చేస్తారు?

సాయి తేజ్‌: సాధారణంగా నేను రీమేక్‌ల జోలికి వెళ్లను. ఒకవేళ ఛాన్స్‌ వస్తే ‘చంటబ్బాయ్‌’ చేస్తా.

టాలీవుడ్‌లో మీ ఫేవరెట్‌ డ్యాన్సర్‌ ఎవరు?

సాయి తేజ్‌: చిరంజీవి గారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

చిరంజీవి గురించి ఒక్కమాటలో?

సాయి తేజ్‌: గాడ్‌ ఫాదర్‌

‘తిక్క’ మూవీ కథానాయిక ఎక్కడ ఉంది సార్‌?

సాయి తేజ్‌: వెళ్లిపోయింది బ్రో

ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన పాట?

సాయి తేజ్‌: జెర్సీ థిమ్‌ సాంగ్

రవితేజతో మల్టీస్టారర్‌ చేస్తారా?

సాయి తేజ్‌: సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాను

మీ గ్యాలరీలో బెస్ట్‌ ఫొటో ఏది?

సాయి తేజ్: నా ఆల్బమ్‌లో నాకెంతో ఇష్టమైన ఫొటో. మా తాతయ్యతో దిగింది.

మెగాస్టార్‌ చిత్రాల్లో ఇష్టమైన సినిమా?

సాయి తేజ్‌: గ్యాంగ్‌ లీడర్‌, యముడికి మొగుడు ఇంకా చాలా ఉన్నాయి

సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేవారు? ముఖ్యంగా మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు?

సాయి తేజ్‌: ఉదయాన్నే బెట్‌ కట్టి క్రికెట్‌ ఆడేవాడ్ని. మధ్యాహ్నం లంచ్‌, నిద్రపోవడం. సాయంత్రం మళ్లీ క్రికెట్‌ ఆడి రాత్రి భోజనం తినడం, నిద్రపోవడం.

వరుణ్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి?

సాయి తేజ్‌: నా తమ్ముడు బంగారం

అల్లు అర్జున్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి?

సాయి తేజ్‌: మా కుటుంబంలో ఎంతో కష్టపడే వ్యక్తి

చిన్నతనంలో మీ అభిమాన టీచర్‌ ఎవరు?

సాయి తేజ్‌: చెన్నైలో చిట్టినాడ్‌ విద్యాశ్రమంలోని శ్రీదేవి మేడమ్‌

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ తర్వాత సినిమా ఏంటి?

సాయి తేజ్‌: దేవకట్ట డైరెక్టర్‌లో ఓ సినిమా చేస్తున్నాను. వివరాలు త్వరలోనే చెప్తా

వైష్ణవ్‌ తేజ్‌ను వెండితెరపై ఎప్పుడు చూడొచ్చు?

సాయి తేజ్‌: త్వరలోనే

మహేశ్‌ చిత్రాల్లో ఫేవరెట్‌ సినిమా ఏది?

సాయి తేజ్‌: ఒక్కడు నా ఆల్‌ టైం ఫేవరెట్‌. ఖలేజా కామెడీ టైమింగ్‌ సూపర్‌గా ఉంటుంది

మీ సినిమాల్లో మీకు నచ్చిన చిత్రమేది?

సాయి తేజ్‌: రేయ్‌, పిల్లానువ్వులేని జీవితం, చిత్రలహరి అవి అన్నీ ఒకే కారణం వల్ల నా ఫేవరెట్‌ చిత్రాలయ్యాయి.

రామ్‌చరణ్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి?

సాయి తేజ్‌: సీతారామరాజుచరణ్‌

మీ స్ఫూర్తి ఎవరు?

సాయి తేజ్‌: నా స్ఫూర్తి, ప్రేమ చిరంజీవి

‘అలవైకుంఠపురములో’ ఏ థియేటర్‌లో చూడనున్నారు?

సాయి తేజ్‌: పీవీఆర్‌లో నైట్‌ షో

అన్నీ ఫ్యామిలీస్‌లాగానే మెగా ఫ్యామిలీకి కూడా వాట్సాప్‌ గ్రూప్‌ ఉందా? దానికి అడ్మిన్‌ ఎవరు? సమాధానం చెప్పకపోతే మన ఇద్దరి ఫేవరెట్‌ సమంత మీద ఒట్టు..!

సాయి తేజ్‌: హహ్హహ్హ.. ఉంది

చై, మీ సినిమాలు ఎప్పుడూ వారం గ్యాప్‌లోనే విడుదల కావడానికి కారణమేమిటి?

సాయి తేజ్: స్కూల్‌, డిగ్రీ స్నేహితులం కదా ఆ అనుబంధం అలాంటిది.

మహేశ్‌తో నటించే అవకాశం వస్తే చేస్తారా?

సాయి తేజ్‌: మహేశ్‌ అన్నతో ఓ పాత్ర చేయాలని ఉంది

బన్నీ, చెర్రీ, తారక్‌లలో బెస్ట్‌ డ్యాన్సర్‌ ఎవరు?

సాయి తేజ్‌: ముగ్గురు

వరుణ్‌ తేజ్‌: ఓ బావా పార్టీకి ఎప్పుడు వస్తున్నావ్‌..?

సాయి తేజ్‌: చాట్‌ సెషన్‌ అవ్వగానే నీ దగ్గరకే బావా

చిరంజీవి డ్యాన్స్‌లను మీరు మ్యాచ్‌ చేయగలరా?

సాయి తేజ్‌: చేయలేను

టైంపాస్‌కు ఏం చేస్తారు?

సాయి తేజ్‌: పబ్జీ ఆడతాను. విన్నర్‌ విన్నర్‌ చికెన్‌ డిన్నర్‌

సుప్రీమ్‌ తర్వాత వరుసగా 6 పరాజయాలు. ఇప్పుడు వెంట వెంటనే రెండు హిట్లు.. ఈ మూడేళ్లో మీ అనుభవం ఏంటి?

సాయి తేజ్‌:  ప్రతి క్షణాన్ని ఇష్టపడ్డాను

సమంత గురించి ఒక్కమాటలో చెప్పండి?

సాయి తేజ్‌: అభిమాన నటి

మీకు పొగరు ఎక్కవ అని అందరూ అంటారు? మీరెమంటారు?

సాయి తేజ్‌: ఏమో అండి నాకు తెలీదు

2019 బెస్ట్‌ ఫొటో

సాయి తేజ్‌: ఈ ఏడాది ఇదే నా బెస్ట్‌ పిక్చర్‌

2019లో మీ అభిమాన చిత్రాలు?

సాయి తేజ్‌: జెర్సీ, సైరా, ఇస్మార్ట్‌ శంకర్‌, చిత్రలహరి

రాశీఖన్నాతో పనిచేయడం ఎలా ఉంది?

సాయి తేజ్‌: తను నాకు మంచి ఫ్రెండ్‌. తనతో పనిచేయడం ఎప్పటికీ ఇష్టమే

బన్నీ సినిమాల్లో మీకు ఇష్టమైన చిత్రమిది?

సాయి తేజ్‌: ఆర్య, జులాయి

ఇష్టమైన ఆహారం?

సాయి తేజ్‌: పప్పు ఆవకాయ్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.