close

తాజా వార్తలు

Updated : 01/01/2020 19:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

 మెరిశారు..!

 ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన క్రీడాకారులు

ముగిసిన జిల్లా స్థాయి ‘ఈనాడు’ స్పోర్ట్స్‌ లీగ్‌-2019 పోటీలు

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: వరంగల్‌ నగరంలోని ఎల్బీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ‘ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌- 2019’ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ముగిశాయి. బ్యాడ్మింటన్, చదరంగం, అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడాంశాల్లో రెండు రోజులపాటు పోటీలు జరిగాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన జూనియర్‌ కళాశాలలకు చెందిన క్రీడాకారులు విజయమే లక్ష్యంగా హోరాహోరీగా తలపడ్డారు. మంగళవారం కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్‌ ఫైనల్స్‌ పోటీల్లో బాలబాలికలు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ తమ జట్ల విజయం కోసం పోరాడారు.

వరంగల్‌ ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి కేఎస్‌పీ రాజు అధ్యక్షతన జరిగిన ముగింపు వేడుకలకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) కె.ప్రశాంత, వాగ్దేవి విద్యాసంస్థల అధినేత సత్యపాల్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు వ్యక్తిగత మెడల్స్, ట్రోఫీలు, ధ్రువీకరణ పత్రాలు బహూకరించారు. గెలుపొటములతో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరూ విజేతలేనని డీఐఈఓ పేర్కొన్నారు. క్రీడా ప్రాంగణంలో గార్డియన్‌ ఆసుపత్రి వారు క్రీడాకారులకు అందుబాటులో అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. టోర్నీలో వివిధ క్రీడాంశాల్లో న్యాయనిర్ణేతలుగా సాంబయ్య, వెంకటేశ్వర్లు, సారంగపాణి, నాగరాజు, వాసు, శ్రీనివాస్, నారాయణ, రాంబాబు, సదానందం, గిరిబాబు, అశోక్, ఖన్నా, రమేశ్, ఇతర పీఈటీలు వ్యవహరించారు.

ఖోఖోలో నువ్వా? నేనా?

నువ్వా నేనా అంటూ సాగిన బాలుర ఫైనల్స్‌లో ఎల్బీ కళాశాల వరంగల్‌ జట్టుపై టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ, వర్ధన్నపేట జట్టు పోరాడి గెలిచింది. చివరి సమయం వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఒక పాయింట్‌ తేడాతో టీస్‌డబ్ల్యూఆర్‌జేసీ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. బాలికల విభాగంలో అక్షయ జూనియర్‌ కళాశాల, హన్మకొండ జట్టుపై టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ, పాలకుర్తి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. 

ఉత్కంఠ పోరు

హోరాహోరీగా సాగిన వాలీబాల్‌ బాలుర ఫైనల్స్‌ ఉత్కంఠభరింతగా సాగింది. ఎల్బీ కళాశాల, వరంగల్‌ జట్టుపై ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, కొత్తగూడ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసి ట్రోఫీని అందుకుంది. మూడు సెట్లలో రెండింటిలో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. బాలికల విభాగంలో ఎల్బీ కళాశాల, వరంగల్‌ జట్టుపై టీఎస్‌టీడబ్ల్యూఆర్‌ఈజేఎస్, పెద్దమ్మగడ్డ జట్టు విజయాన్ని అందుకుంది. 

అథ్లెటిక్స్‌లో..

100 మీటర్ల బాలికల విభాగంలో స్వర్ణం రాజ్యలక్ష్మి, రజతం శ్రావణి (టీఎస్‌టీడబ్ల్యూఆర్‌ఈజేఎస్, పెద్దమ్మగడ్డ)  కాంస్య పతకం, సుమతి, రామప్ప జూనియర్‌ కాలేజీ, హన్మకొండ  

200 మీటర్ల బాలికల విభాగంలో స్వర్ణం సుమతి, రజతం  సింధూజ రామప్ప జూనియర్‌ కాలేజీ, హన్మకొండ. కాంస్యం మానస, టీఎస్‌ఎంఎస్, వంచనగిరి  

100 మీటర్ల బాలుర విభాగంలో రంజిత్‌ స్వర్ణం, టీఎస్‌ఎంఎస్, గవిచర్ల. ప్రేమ్‌ రజతం, ఎల్బీ కాలేజీ, వరంగల్‌. లక్ష్మణ్‌ కాంస్యం, శ్రీసాయి కళాశాల, హన్మకొండ.

200 మీటర్ల బాలుర రంజిత్‌ స్వర్ణం, టీఎస్‌ఎంఎస్, గవిచర్ల. అరవింద్‌ రజతం, రామప్ప జూనియర్‌ కాలేజీ, హన్మకొండ. లక్ష్మణ్, కాంస్యం, శ్రీసాయి జూనియర్‌ కళాశాల, హన్మకొండ.

చదరంగంలో..

బాలికల విభాగంలో భార్గవి, స్వర్ణం, టీఎస్‌ఆర్‌జేసీ, హసన్‌పర్తి. లిఖితశ్రీ, రజతం, సువిద్య జూనియర్‌ కళాశాల, హన్మకొండ.

బాలుర విభాగంలో రిషికేష్, స్వర్ణం, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, వర్ధన్నపేట. రవితేజ, రజతం, టీఎస్‌ఎంఎస్, గవిచర్ల. 

కబడ్డీ.. కబడ్డీ.! 

బాలికల టీఎస్‌టీడబ్ల్యూఆర్‌ఈజేఎస్, పెద్దమ్మగడ్డ జట్టు ఏకంగా ట్రోఫీని ఎగురేసుకుపోయింది. ఫైనల్స్‌లో శ్రీబాలాజీ జూనియర్‌ కాలేజీ, హన్మకొండ జట్టుపై ఈ జట్టు  చివరి వరకు పోరాడి గెలుపును అందుకున్న తీరు ఆకట్టుకుంది. బాలురు విభాగంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, తొర్రూరు జట్టుపై శ్రీబాలాజీ జూనియర్‌ కాలేజీ, హన్మకొండ జట్టు సులువుగా విజయకేతనం ఎగురవేసింది. 

బ్యాడ్మింటన్‌ పోటీలో.. 

సింగిల్స్‌ బాలికల విభాగంలో తనుశ్రీ, స్వర్ణం, ఓరగల్లు జూనియర్‌ కళాశాల, హన్మకొండ. యశస్వినీ, రజతం, ఎస్‌వీఎస్‌ జూనియర్‌ కళాశాల, భీమారం.  

డబుల్స్‌ బాలికల విభాగంలో యశస్వినీ, దీపిక, స్వర్ణం, ఎస్‌వీఎస్‌ జూనియర్‌ కళాశాల, భీమారం. అక్షిత, సంగీత, రతజం, టీఎస్‌ఆర్‌జేసీ, హసన్‌పర్తి.

బాలుర సింగిల్స్‌ విభాగంలో మణిదీప్‌ స్వర్ణం, ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, మట్టెవాడ. సహృదయ్, రజతం, శ్రీబాలాజీ జూనియర్‌ కాలేజీ, హన్మకొండ.

బాలుర డబుల్స్‌ విభాగంలో సహృదయ్, అనిరుద్‌ స్వర్ణం, శ్రీ బాలాజీ జూనియర్‌ కాలేజీ, హన్మకొండ. విజేయ్‌తేజ, సుశీల్‌ రజతం, శ్రీసాయి జూనియర్‌ కాలేజీ, భీమారం. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.