close

తాజా వార్తలు

Published : 02/01/2020 12:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వెంకీ సరసన ప్రియమణి..?

హైదరాబాద్‌: తమిళ నటుడు ధనుష్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘అసురన్‌’. భూ వివాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసల లభించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించనున్న ఈ రీమేక్‌లో వెంకటేశ్‌ నటించనున్నట్లు తెలిపింది. అయితే, ‘అసురన్‌’ చిత్రంలో కీలకమైన ధనుష్‌ సతీమణి మంజువారియర్‌ పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయం పై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన వెలవడలేదు. దీంతో ఈ సినిమాలో వెంకటేశ్‌కు జంటగా శ్రియా కనిపించనున్నారంటూ గతకొంతకాలం వార్తలు వచ్చాయి. వీటిపై ఎటువంటి స్పష్టత రాలేదు. తాజాగా ప్రియమణి పేరు కూడా వినిపిస్తోంది. ఈ మేరకు చిత్రబృందం ఇప్పటికే ఆమెను కలిసిందట. కథ కూడా నచ్చడంతో ప్రియమణి సైతం వెంకటేశ్‌ సరసన ‘అసురన్‌’ రీమేక్‌లో నటించడానికి సిద్ధంగా ఉన్నారని టాలీవుడ్‌లో టాక్‌. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.