close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 03/01/2020 05:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నవ వాహన పరవశం

కొత్త ఏడాదిలో కొత్తదనం కోరుకుంటారు ఎవరైనా... వాహన ప్రియులు అందుకు మినహాయింపేం కాదుగా! ముఖ్యంగా కారు, బైక్‌ కొనాలనుకునేవాళ్లు నూతన సంవత్సరంలో విడుదలయ్యే బండి కోసం ఆరా తీయడం... తమకు నచ్చే ఫీచర్ల కోసం ఆరాట పడటం సహజమే కదా! వాళ్ల ఆశలకు తగ్గట్టే 2020 ప్రారంభంలోనే కొత్త మోడళ్లు భారీగా రంగప్రవేశం చేయబోతున్నాయి... ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే ప్రత్యేకతలెన్నో వాటి సొంతం... ఈ రెండు నెలల్లో మార్కెట్‌ని ముంచెత్తబోతున్న ఆ వాహనాల వివరాలు సంక్షిప్తంగా... చిన్నగా రైడింగ్‌ చేసేద్దాం రండి… మరి!


హ్యోసుంగ్‌ జీడీ250ఎన్‌

మన రైడర్లు మెచ్చేలా మార్పులు చేసి ఈ మోడల్‌ తీసుకొచ్చామంటోంది కొరియన్‌ కంపెనీ. ఆకర్షణీయమైన డిజైన్‌ భారతీయుల్ని ఏమాత్రం నిరాశపరచదంటోంది హ్యోసుంగ్‌. 249 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో పని చేస్తుంది. 27 బీహెచ్‌పీ, 24 ఎన్‌ఎం టార్క్‌ సాంకేతికాంశాలు. డ్యూక్‌ 200తో పోటీ పడుతుంది.
విభాగం: స్ట్రీట్‌ నేక్డ్‌,
విడుదల: ఫిబ్రవరి, 2020,
ధర: రూ.1.60లక్షలు-రూ.1.90లక్షలు


యమహా ఎంటీ 03

ఎంటీ వరుసలో ఇది నాలుగో మోడల్‌. హెడ్‌ల్యాంప్‌, ఇంధన ట్యాంకులు గత ఎంటీ మోడళ్లకన్నా పెద్దవి. దృఢమైన సెమీ ట్రెలిస్‌ స్టీల్‌ ఫ్రేమ్‌, మెరుగైన సస్పెన్షన్‌, స్టైలిష్‌ ఎగ్జాస్ట్‌ ఈ బండి బలాలు. 321సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ప్యారలల్‌ ట్విన్‌ ఇంజిన్‌తో దూసుకెళ్తుంది.
విభాగం: స్ట్రీట్‌ ఫైటర్‌
విడుదల: ఫిబ్రవరి 2020
ధర: రూ.2.80లక్షలు


టాటా గ్రావిటాస్‌

లాండ్‌రోవర్‌ ప్లాట్‌ఫాం మీద తయారు చేస్తున్న కారు గ్రావిటాస్‌. మూడు వరుసల్లో, 7 సీట్లతో వస్తోంది. బ్లోయర్‌ కంట్రోళ్లు, 8.8 అంగుళాల తాకే తెర, స్టీరింగ్‌ మౌంటెడ్‌ కంట్రోళ్లు, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, భారీ చక్రాలు, స్టైలిష్‌ డిజైన్‌ దీని సొంతం. 2.0లీటర్ల టర్బో డీజిల్‌ ఇంజిన్‌ కారు ఇది.
విభాగం: ఎంపీవీ
విడుదల: ఫిబ్రవరి 2020
ధర: రూ.18 లక్షలు-రూ.23లక్షలు


ఆడీ క్యూ8

ఐదు సీట్ల కూపే. హెగ్జాగోనల్‌ గ్రిల్‌, వెడల్పాటి చక్రాలు, పనోరమిక్‌ రూఫ్‌, సన్నని హెడ్‌ల్యాంప్‌లతో స్పోర్టీ డిజైన్‌ రూపంలో వస్తోంది. వర్చువల్‌ కాక్‌పిట్‌, భారీ ఇన్ఫోటైన్‌మెంట్‌ తెర, 360డిగ్రీల కోణం ఉండే పార్కింగ్‌ అసిస్ట్‌, వెంటిలేటెడ్‌ పవర్‌ సీట్లు.. కొన్ని ఫీచర్లు. 3.0 లీటర్ల వీ6 డీజిల్‌.. 2.0, 3.0లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ రకాలున్నాయి.
విభాగం: కూపే ఎస్‌యూవీ
విడుదల: 15 జనవరి, 2020
ధర: 1.2కోట్లు


టాటా ఆల్ట్రోజ్‌

అత్యధిక ఫీచర్లు, అందుబాటు ధరతో వస్తున్న ఆల్ట్రోజ్‌తో ఈ విభాగంలో ఉన్న పోటీదారులకు సవాల్‌ విసురుతామంటోంది టాటా మోటార్స్‌. ఆల్ఫా అనే మాడ్యులర్‌ ప్లాట్‌ఫాం మీద దీన్ని రూపొందించారు. భద్రతకి పెద్దపీట వేశారు. కీలెస్‌ ఎంట్రీ, ఎలక్ట్రిక్‌ ఓఆర్‌వీఎంలు, క్రూజ్‌ కంట్రోల్‌, అడ్జస్టబుల్‌ స్టీరింగ్‌, యూఎస్‌బీ కనెక్టివిటీ, హర్మాన్‌ టచ్‌స్క్రీన్‌.. చెప్పుకోతగ్గ ఫీచర్లు. 1.2లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ దీని సొంతం.
విభాగం: హ్యాచ్‌బాక్‌
విడుదల: 22 జనవరి, 2020
ధర: రూ.5.5లక్షలు-8లక్షలు


స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఆర్‌ఎస్‌

పూర్తిస్థాయి మార్పులతో, కొత్త ఏడాదిలో అప్‌డేటెడ్‌ వెర్షన్‌తో వస్తోంది స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఆర్‌ఎస్‌. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, పిలియన్‌కి విశాలమైన లెగ్‌రూం, డిజిటల్‌ టీఎఫ్‌టీ తెర ఉన్నాయి. దాన్ని ‘మై ట్రయంఫ్‌’ యాప్‌తో అనుసంధానించొచ్చు. రోడ్‌, రెయిన్‌, స్పోర్ట్‌, ట్రాక్‌ అనే రైడింగ్‌ మోడ్‌లున్నాయి. 765సీసీ ఇన్‌లైన్‌ 3 ఇంజిన్‌తో వస్తోంది.
విభాగం: సూపర్‌ స్పోర్ట్‌
విడుదల: జనవరి, 2020
ధర: రూ.11లక్షలు


మహీంద్రా ఈ20 ఎన్‌ఎక్స్‌టీ

ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్తు కార్లతో పోలిస్తే తక్కువ ధరలో, మంచి ఫీచర్లు ఈ20 ఎన్‌ఎక్స్‌టీలో ఉన్నాయంటోంది మహీంద్రా. సంప్రదాయ నలుపు రంగు గ్రిల్‌కి భిన్నమైన గ్రిల్‌ వాడారు. నీలం రంగులో లైటింగ్‌, డబుల్‌ బ్యారెల్‌ హెడ్‌ల్యాంప్‌లు, 14 అంగుళాల డైమండ్‌ కట్‌ అలాయ్‌ చక్రాలు, భారీ తాకే తెర, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, హెచ్‌డీ కలర్‌ డిస్‌ప్లే.. ఫీచర్లు. ఇంజిన్‌ వివరాల్లేవు.
విభాగం: ఎలక్ట్రిక్‌
విడుదల: ఫిబ్రవరి 2020
ధర: రూ.6 లక్షలు-రూ.8 లక్షలు.


బజాజ్‌ చేతక్‌

ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న కొత్త బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ జనవరిలో రోడ్లమీదకు రానుంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా, ఆధునిక ఫీచర్లు జోడించామంటోంది బజాజ్‌. షీట్‌ మెటల్‌ బాడీ, ఎల్‌ఈడీ లైట్లు, బ్లూటూత్‌తో అనుసంధానించే డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌ చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు. ఎలక్ట్రిక్‌ మోటార్‌ ఐపీ67 రేటెడ్‌ లిథియం-అయాన్‌ బ్యాటరీతో వస్తోంది. ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌తో 95 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
విభాగం: స్కూటర్‌,
విడుదల: జనవరి, 2020,
ధర: రూ.లక్ష


హ్యుందాయ్‌ ఔరా

ఎక్స్‌సెంట్‌ మోడల్‌ స్థానంలో హ్యుందాయ్‌ తీసుకొచ్చిన కారే ఔరా. క్యాస్కేడింగ్‌ గ్రిల్‌, బూమెరాంగ్‌ ఆకారంలో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, కొత్త బంపర్‌, ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, ఆర్కెమిస్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌.. మేటి ఫీచర్లు. 1.2 లీటర్ల ఇంజిన్‌తో వస్తోంది.
విభాగం: కాంపాక్ట్‌ సెడాన్‌
విడుదల: జనవరి 2020
ధర: రూ.6-9లక్షలు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.