close

తాజా వార్తలు

Published : 03/01/2020 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ చైనా ఫోన్లలో ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌ ఇక ఈజీ!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఒకరి నుంచి వేరొకరికి ఇంటర్నెట్‌ అవసరం లేకుండా ఫైల్స్‌ పంపించుకునే సదుపాయం ఉన్న సంగతి అందికీ తెలిసిందే. అయితే, చాలా కంపెనీలు తమ సొంత ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌ అప్లికేషన్‌ అందిస్తున్నప్పటికీ అవి ఆ కంపెనీల ఫోన్ల వరకు మాత్రమే పరిమితం. షావోమీ ఫోన్లు వాడే వారు ఆ కంపెనీ ఫోన్లకు మాత్రమే ఫైల్స్‌ను పంపించగలరు. ఇతర కంపెనీ ఫోన్‌కు పంపాలంటే ‘షేర్‌ ఇట్‌’ లాంటి థర్డ్‌పార్టీ యాప్స్‌పై ఆధారపడాల్సిందే. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, వివో ఒక వేదికపైకి వచ్చాయి. ‘పీర్‌ టు పీర్‌’ (పీ2పీ) ట్రాన్స్‌మిషన్‌ కోసం చేతులు కలిపాయి. దీనివల్ల ఆ మూడు కంపెనీలకు చెందిన ఏ ఫోన్ల నుంచి ఏ కంపెనీ ఫోన్లకైనా తమ సొంత షేరింగ్‌ యాప్‌ను ఉపయోగించి ఫైల్స్‌ను త్వరగా పంపించుకోవచ్చు. గ్లోబల్‌గా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మూడు కంపెనీలు ప్రకటించాయి. ప్రస్తుతం ఒప్పో, షావోమీ ఫోన్లలో ఈ ఫీచర్‌ పనిచేస్తోంది.

ఆండ్రాయిడ్‌ పై, అ పై వెర్షన్లు వాడే ఫోన్లలో పీ2పీ ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్‌ పనిచేస్తుందని షావోమీ ప్రకటించింది. ఎంఐ వాడే ఫైల్‌ షేరింగ్‌ సదుపాయాన్ని ఎంఐ షేర్‌గా అందరికీ సుపరిచితమే. అలాగే ఆండ్రాయడ్‌ 10తో పనిచేసే కలర్‌ ఓఎస్‌ 7, ఆపై వెర్షన్లు వాడే ఫోన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు ఒప్పో ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఈ సదుపాయం తీసుకొస్తామని వివో పేర్కొంది. ఇందులో మరిన్ని సార్మ్‌ఫోన్‌ తయారీ కంపెనీలు సైతం భాగస్వాములు కావాలని ఈ మూడు కంపెనీలు కోరాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.