ఆ డబ్బు బరువు 625 టన్నులు..!
close

తాజా వార్తలు

Updated : 05/01/2020 19:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ డబ్బు బరువు 625 టన్నులు..!

ముంబయి: నోట్ల రద్దు తర్వాత దాదాపు భారీగా డబ్బును వాయుసేన విమానాల్లో తరలించామని వాయుసేన మాజీ చీఫ్‌ బీఎస్‌ ధనోవా వెల్లడించారు. ఆయన ఐఐటీ టెక్‌ ఫెస్ట్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2016లో నోట్ల రద్దు తర్వాత దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వైమానిక దళం సాయంతో దాదాపు 625 టన్నుల బరువున్న కొత్త కరెన్సీ కట్టలను చేర్చామన్నారు. రూ.కోటి రూపాయల బరువు 20 కేజీలు ఉండవచ్చన్నారు. దాదాపు ఎంత వెళ్లిందో తెలియదని చెప్పారు. దీనికోసం ఐఏఎఫ్‌ 33 మిషన్స్‌ను చేపట్టినట్లు వివరించారు. 

ఇక రఫేల్‌ వివాదంపై స్పందిస్తూ.. అంతకు ముందు బోఫోర్స్‌ శతఘ్నులు కొనుగోలు చేసినప్పుడు కూడా వివాదాస్పదమైందని గుర్తు చేశారు. కానీ, ఆ శతఘ్నులు అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు. అభినందన్‌ వర్థమాన్‌ కనుక రఫేల్‌లో వెళ్లి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. ధనోవా 2016 డిసెంబర్‌ 31న వైమానిక దళ బాధ్యతలు చేపట్టారు. ఆయన 30 సెప్టెంబర్‌ 2019 వరకు ఆ పదవిలో ఉన్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని