close

తాజా వార్తలు

Published : 07/01/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చర్చి తోటల్లో.. అనువంశిక సూత్రాలు!

అనువంశికత
అరమార్కు ప్రశ్నలు

1. అవశేషావయవాలకు ఒక ఉదాహరణ రాయండి.
జ: ఉండుకం, చర్మంపై కేశాలు.
2. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
జ: పురాజీవశాస్త్రం అంటారు.
3. ఇతను ఒక మత గురువు, విశ్వవిద్యాలయాల్లో ప్రయోగాలు చేయలేదు. చర్చితోటల్లోనే ప్రయోగాలు చేస్తూ అనువంశిక సూత్రాలు కనక్కొని జన్యుశాస్త్ర పితామహుడిగా పేరుగాంచాడు. ఆ గొప్ప శాస్త్రవేత్త పేరు ఏమిటి?
జ: గ్రెగర్‌ జోహన్‌ మెండల్‌


5. వైవిధ్యాలు అంటే ఏమిటి?
జ: దగ్గరి సంబంధం ఉన్న సమూహాలకు చెందిన జీవుల మధ్య గల లక్షణాల్లోని భేదాలను వైవిధ్యాలు అంటారు.
6. ఆడ శిశువులో 23 జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఆమెకు 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆమెలో ఎన్ని జతల శారీరక, లైంగిక క్రోమోజోమ్‌లు ఉంటాయి?
జ: 22 జతల శారీరక క్రోమోజోమ్‌లు, ఒక జత లైంగిక క్రోమోజోమ్‌లు ఉంటాయి.

7. ఆర్జిత లక్షణాలు సంతతి ద్వారా తర్వాతి తరాలకు అందించబడతాయని డార్విన్‌ ప్రతిపాదించాడు. దీన్ని ‘మనుగడ కోసం పోరాటం’ సూత్రం అంటారు. పై వాక్యాన్ని సరిచేసి రాయండి.
జ: ఆర్జిత లక్షణాలు సంతతి ద్వారా తర్వాతి తరాలకు అందించబడతాయని లామార్క్‌ ప్రతిపాదించాడు. దీన్ని ఆర్జిత గుణాల అనువంశికత సూత్రం అంటారు.
8. శిలాజాలు అంటే ఏమిటి?
జ: ప్రాచీన జీవయుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే, ప్రకృతి సిద్ధంగా భద్రపరిచిన నిర్జీవ పదార్థాలను శిలాజాలు అంటారు.
9. అండం ఫలదీకరణ తర్వాత పిండంగా అభివృద్ధి చెందేవరకు వివిధ దశలను వివరించే శాస్త్రాన్ని ఏమంటారు?
జ: పిండాభివృద్ధిశాస్త్రం

10. చార్లెస్‌ డార్విన్‌ తన పరిశోధన కోసం ఉపయోగించిన నౌక పేరు ఏమిటి?
జ: బీలీళీ బీగిల్‌
11. జీవపరిణామం గురించి చార్లెస్‌ రాబర్ట్‌ డార్విన్‌ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది?
జ: ప్రకృతివరణ సిద్ధాంతం


1 మార్కు ప్రశ్నలు

1. మెండల్‌ తన ప్రయోగం కోసం బఠానీ మొక్కలను ఎన్నుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారు?
జ: మెండల్‌ తన ప్రయోగాలకు బఠానీ మొక్కలను ఎంపిక చేసుకోవడానికి కారణాలు

* స్పష్టమైన లక్షణాలను కలిగి ఉండటం.
* ద్విలింగ పుష్పాలు ఉండటం.
* ఆత్మపరాగ సంపర్కం జరపడం.
* సంకరీకరణానికి అనువుగా ఉండటం.
* బఠానీ ఏకవార్షిక మొక్క కావడం.
2. ఒక శాస్త్రవేత్త జనకతరంలోని ఎలుక తోకలు కత్తిరించాడు. తర్వాతి తరం ఎలుకల సంతతిలో తోకలు ఉంటాయా? ఉండవా? ఈ ప్రయోగ ఫలితం ఏమిటి?
జ: ఆగస్టస్‌ వీస్‌మాన్‌ జనకతరం ఎలుకల తోకలు కత్తిరించాడు. తర్వాతి తరాల ఎలుకలకు తోకలు ఉంటాయి. ఈ ప్రయోగం ద్వారా లామార్క్‌ ఆర్జిత గుణాల అనువంశిక సూత్రం తప్పు అని నిరూపించాడు.
3. సమయుగ్మజం అంటే ఏమిటి? ఉదాహరణ రాయండి.
జ: ఒక లక్షణాన్ని నిర్ణయించే రెండు కారకాలు ఒకటే అయితే వాటిని సమయుగ్మజాలు అంటారు.
ఉదా: విత్తనం పసుపురంగును నిర్ణయించే కారకాలు (్త్త్ర్ర) అయితే దాన్ని సమయుగ్మజం అంటారు.
4. ప్రస్తుత మానవుడి శాస్త్రీయ నామాన్ని రాయండి.
జ: హోమో సెపియన్‌
5. కారకాలు అంటే ఏమిటి?
జ: ఒక జీవి లక్షణాలను నిర్ణయించే వాటిని కారకాలు అని మెండల్‌ ప్రతిపాదించాడు. ఒక లక్షణాన్ని ఒక జత కారకాలు నిర్ణయిస్తాయని తెలిపాడు. వాటిని ప్రస్తుతం జన్యువులు అంటున్నాం.
6. విషమయుగ్మజం అంటే ఏమిటి?
జ: ఒక లక్షణాన్ని నిర్ణయించే రెండు కారకాలు ఒకటిగా కాకుండా వేర్వేరుగా ఉంటే వాటిని విషమయుగ్మజాలు అంటారు.
ఉదా: విత్తనం పసుపురంగును నిర్ణయించే కారకాలు (్త్వ్ర) అయితే దాన్ని విషమయుగ్మజం అంటారు.
7. అనువంశిక లక్షణాలు అంటే ఏమిటి?
జ: తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే లక్షణాలను అనువంశిక లక్షణాలు అంటారు.
8. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటే ఏమిటి?
జ: ఒక జత లక్షణాలకు కారణమైన కారకాలు ఇతర లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి అందించడాన్ని స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటారు.


2 మార్కుల ప్రశ్నలు

1. నిర్మాణ సామ్య అవయవాలు అంటే ఏమిటి? ఉదాహరణ రాయండి.
జ: వివిధ జంతువుల్లో అనేక రకాల పనులు నిర్వర్తిస్తూ అంతర్నిర్మాణంలో ఒకే రకంగా ఉండే అవయవాలను నిర్మాణ సామ్య అవయవాలు అంటారు.
ఉదా: తిమింగలంలో వాజాలు ఈదడానికి, గబ్బిలంలో రెక్కలు ఎగరడానికి, చిరుతలో కాళ్లు పరుగెత్తడానికి ఉపయోగించినా అంతరనిర్మాణంలో ఎముకల అమరిక ఒకేరకంగా ఉంటుంది.
2. ఆర్జిత గుణాల అనువంశికత అంటే ఏమిటి? ఉదాహరణ రాయండి. దీన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జ: ఒక జీవి తన మనుగడ కోసం కొన్ని లక్షణాలను అభివృద్ధి చేసుకుంటుంది. వాటిని ఆర్జిత గుణాలు అంటారు. ఈ గుణాలు తర్వాతి తరాలకు అందిస్తాయని చెప్పే సిద్ధాంతాన్ని ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతం అంటారు.
ఉదా: జిరాఫీ చెట్టు ఆకులను అందుకోవడం కోసం పొడవాటి మెడను ఆర్జించుకుంది. ఇది తర్వాతి తరాలకు వచ్చింది కాబట్టి పొడవైన మెడ గల జిరాఫీలు ఏర్పడ్డాయి. ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినవారు లామార్క్‌.
3. క్రియాసామ్య అవయవాలు అంటే ఏమిటి? ఉదాహరణలతో వివరించండి.
జ: అంతర నిర్మాణంలో వేర్వేరుగా ఉన్నప్పటికీ ఒకే రకమైన పనిని నిర్వర్తించే వాటిని క్రియాసామ్య అవయవాలు అంటారు. ఉదా: వివిధ పక్షుల, గబ్బిలం రెక్కలను పరిశీలిస్తే వాటి అంతర నిర్మాణాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ అవి రెండు అవయవాలనూ ఎగరడానికి ఉపయోగిస్తాయి.
4. శిలాజాల వయసు, ఇతర విషయాలను ఎలా లెక్కిస్తారు? ఈ విధానాన్ని ఏమంటారు?
జ: శిలాజాలపై రేడియోధార్మిక పదార్థాలైన కార్బన్‌, యురేనియం, పొటాషియం ఐసోటోపులను ఉపయోగించి శిలాజాల లోపలి ఖనిజ లవణాలు లేదా ఐసోటోపుల అర్ధజీవిత కాలాన్ని లెక్కించడం ద్వారా శిలాజాల వయసును లెక్కిస్తారు. ఈ విధానాన్ని కార్బన్‌ డేటింగ్‌ పద్ధతి అంటారు.
5. దృశ్యరూపం అంటే ఏమిటి? ఏకసంకర సంకరీకరణంలో దృశ్యరూప నిష్పత్తిని రాయండి.
జ: F2 తరంలో ఏర్పడిన మొక్కల్లో 75 శాతం పసుపురంగు విత్తనాలు, 25 శాతం ఆకుపచ్చ రంగు విత్తనాలు ఏర్పడ్డాయి. బయటకు కనిపించే లక్షణాన్ని దృశ్యరూపం, ఆ నిష్పత్తిని దృశ్యరూప నిష్పత్తి అంటారు. కాబట్టి దృశ్యరూప నిష్పత్తి 3 : 1.

యోగ్యతమముల సార్థక జీవనం: మనుగడ కోసం పోరాటంలో ఏర్పడిన అన్ని జీవులు కొత్త జీవులుగా పరిణామం చెందవు. వీటిలో ప్రకృతిలో బతకడానికి యోగ్యత ఉన్నవి మాత్రమే బతుకుతాయి. మిగతావి నశిస్తాయి.
ఉదా: ఎర్ర పురుగులు, పచ్చపురుగుల్లో ఎర్ర పురుగులకు యోగ్యత లేక నశించాయి. పచ్చ పురుగులు యోగ్యతతో బతికాయి.

ప్రకృతివరణ సిద్ధాంతం: యోగ్యతమముల ద్వారా ఏర్పడిన జీవులు ప్రకృతిలో పరిస్థితులకు అనుకూలంగా రూపొందుతాయి. అప్పుడు ప్రకృతి వాటికి అనుకూలనాలను కల్పిస్తుంది. దీన్ని ప్రకృతివరణం అంటారు.
ఈ విధంగా  మొదట జీవుల మధ్య మనుగడకోసం పోరాటం జరిగి ఆ సందర్భంలో ఉపయుక్త అవయవాలు ఏర్పరుచుకుంటూ నిరుపయుక్త అవయవాలను వదిలేస్తూ ప్రకృతిలో బతకడానికి యోగ్యత పొంది కొత్తజీవులు ఏర్పడతాయని డార్విన్‌ ప్రతిపాదించాడు.
3. లామార్క్‌ ప్రతిపాదించిన ఆర్జిత గుణాల అనువంశిక సూత్రం లేదా సిద్ధాంతాన్ని ఉదాహరణలతో వివరించండి. లామార్క్‌ సిద్ధాంతాన్ని వీస్‌మాన్‌ ఏవిధంగా తప్పు అని నిరూపించాడో రాయండి.
జ: పూర్వకాలంలో జీవుల్లో మార్పు ఉండదని నమ్మేవారు కానీ తర్వాతి కాలంలో జీవుల్లో మార్పులు ఉంటాయని, ఆ మార్పులతో కొత్తజీవులు ఏర్పడతాయని, దాన్ని జీవపరిణామం అంటారని అనేక జీవపరిణామ సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. అలా జీవపరిణామ సిద్ధాంతాన్ని మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త జీన్‌ బాప్టిస్ట్‌ లామార్క్‌. ఆ జీవపరిణామ సిద్ధాంతం పేరు ఆర్జిత గుణాల అనువంశికత.

ఆర్జిత గుణాల అనువంశికత: ఒక జీవి తన జీవితకాలంలో మనుగడ కోసం అవసరానికి అనుగుణంగా అభివృద్ధి చేసుకున్న గుణాలు లేదా లక్షణాలను ఆర్జిత గుణాలు అంటారు. ఈ విధంగా ఆర్జించిన గుణాలు తమ సంతతికి లేదా తర్వాతి తరానికి అందిస్తాయని లామార్క్‌ ప్రతిపాదించాడు. దీన్నే ఆర్జిత గుణాల అనువంశికత అంటారు.
ఉదా: కొన్నివేల సంవత్సరాలకు పూర్వం జిరాఫీలు జింకల మాదిరి పొట్టి మెడతో ఉండేవి. అవి ఎత్తయిన కొమ్మల ఆకులను తినడానికి నిదానంగా తమ మెడను పెంచుకున్నాయి. ఆ పొడవైన మెడ ఆర్జిత గుణం. ఈ గుణాన్ని తర్వాతి తరాలకు అందించడం వల్ల పొడవైన మెడ గల జిరాఫీలు ఆవిర్భవించాయని లామార్క్‌ వివరించాడు.

లామార్క్‌ సిద్ధాంతం తప్పు - వీస్‌మాన్‌: లామార్క్‌ సిద్ధాంతం తప్పు అని వీస్‌మాన్‌ నిరూపించాడు. అతడు కొన్ని ఎలుకల తోకలు కత్తిరించాడు. తోకలేని గుణం ఉన్న ఎలుకల సంతతికి తోకలు ఉన్నాయి. ఇలా 22 తరాల ఎలుకలకు తోకలు కత్తిరించినా తోక ఉన్న ఎలుకలే జన్మించాయి. అంటే జీవి ఆర్జించుకున్న లక్షణాలు తర్వాతి తరాలకు అనువంశికంగా చేరవని లామార్క్‌ సిద్ధాంతం తప్పు అని నిరూపించాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.