close

తాజా వార్తలు

Published : 07/01/2020 18:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఠాక్రే ప్రభుత్వం ఏం చేస్తోంది..

ముంబయి: జేఎన్‌యూ విద్యార్థులపై దుండగుల దాడికి నిరసనగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వస్తోంది. విద్యార్థులపై దాడికి నిరసనగా ముంబయి గేటు వద్ద చేపడుతున్న ఆందోళనలో ‘స్వేచ్ఛ కశ్మీర్‌’ పేరుతో ప్రదర్శించిన పోస్టర్‌ దీనికి కేంద్ర బిందువుగా మారుతోంది. సోమవారం ఆందోళన సమయంలో ఓ మహిళ ‘ స్వేచ్ఛ కశ్మీర్‌’ పేరిట ఓ పోస్టర్‌ ప్రదర్శించింది. దీనిపై విపక్ష భాజపా మండిపడింది. జాతీయ సమైక్యతకు భంగం కలిగించే ఇలాంటి పోస్టర్లు దర్శన మిస్తుంటే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఏం చేస్తోందని విమర్శించింది. వేర్పాటువాద భావాలను ప్రేరేపించడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. సదరు మహిళను గుర్తించి విచారించేందుకు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. నిరసన సమయంలో సదరు మహిళ మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీరీల ప్రాథమిక హక్కుల కోసమే ఇలా ప్రదర్శించానని అన్నారు. గత ఆరు నెలలుగా కశ్మీరీలోని జ్పఞరిస్థితులను వివరించేందుకే ఇలా చేశానని ఆమె తెలిపారు.

జాతి వ్యతిరేక చర్యలను సమర్థిస్తారా?:ఫడణవీస్‌

విద్యార్థులపై దాడికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో  వేర్పాటు వాదాన్ని సమర్థించే పోస్టర్లు కనిపిస్తుంటే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఏం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విమర్శించారు. ‘‘అసలు ఆందోళల నేపథ్యం ఏంటి? అక్కడ జరుగుతున్నదేంటి? జాతి వ్యతిరేక చర్యలను ముంబయిలో సహించగలమా?ముఖ్యమంత్రి కార్యాలయానికి కేవలం 2 కి.మీ దూరంలోనే ఈ ఘటన జరిగింది. ఇలాంటి సమయాల్లో మిన్నకుంటే ఎలా? ఇలాంటి ఘటనలకు మీరు వత్తాసు పలుకుతున్నారా? ’’ అంటూ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు.

ఆదివారం సాయంత్రం కొందరు దుండగులు జేఎన్‌యూ వర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ సహా మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏబీవీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆరోపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.