close

తాజా వార్తలు

Published : 09/01/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జేఎన్‌యూ దాడిపై ‘సుప్రీం’లో విచారణ చేయాలి

కోల్‌కతా: జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన దాడి ఘటనపై అత్యున్నత స్థాయిలో విచారణ జరపాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఈ విచారణ చేయాల్సిందిగా ఏబీవీపీ కోరింది. దీనిపై ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు సప్తర్షి మాట్లాడుతూ జేఎన్‌యూ ఘటన బాధాకరమని అన్నారు. దీనిపై అత్యున్నత స్థాయిలో విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో 25 ఏబీవీపీ సభ్యులు గాయపడ్డారని కానీ వారి గురించి మాత్రం బయటకు రాలేదని అన్నారు. 

ఆదివారం రాత్రి జేఎన్‌యూ క్యాంపస్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 35 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనను బాలీవుడ్‌ సినీ ప్రముఖులతో సహా పలువురు నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.  ఈ దాడి చేసింది తామేనంటూ హిందూ రక్షా దళ్‌ ప్రకటించింది. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడేవారిపై తాము ఇలాగే వ్యవహరిస్తామంది.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.