close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 10/01/2020 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్రైం షోలు చూసి ముక్కలుగా నరికి...

 

ముంబయి: తల్లిని హత్య చేసిన కేసులో 30 ఏళ్ల వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు మంబయిలోని కుర్లా సబర్బన్‌ ప్రాంతంలో నివసిస్తున్న సోహైల్ షేక్ అనే వ్యక్తి డిసెంబరు 28న మద్యం మత్తులో తల్లితో గొడవపడి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోహైల్ గత కొంత కాలంగా మద్యానికి అలవాటుపడి, ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ విషయమై అతనికి తరచూ తల్లితో గొడవలు జరిగేవి. ఇదే విషయమై గత నెల 28న ఇద్దరికి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో మద్యం మత్తులో ఉన్న సోహైల్ విచక్షణ కోల్పోయి తన తల్లిని గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. తెల్లవారి లేచి చూసేసరికి తల్లి విగతజీవిగా పడిఉండటంతో అతని ఏం చేయాలో పాలుపోలేదు. టీవీలో ప్రసారం అయ్యే క్రైం షో చూశాడు. అనంతరం తల్లి శవాన్ని ముక్కలుగా నరికి, వాటిని వేరు వేరుగా ప్రదేశాల్లో పడవేశాడు.

మరుసటి రోజు కిరోడ్ రోడ్డులోని విద్యావిహార్‌ ప్రాంతంలో తల లేని మొండెం లభించిడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత జనవరి 4న శాంతాక్రూజ్‌ - చెంబూర్‌ లింక్‌ రోడ్డులో బ్రిడ్జి కింద మిగిలిన శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. అప్పటికే శరీర భాగాలన్నీ పూర్తిగా కుళ్లిపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. దీంతో పుర్రె ఆధారంగా మహిళ ముఖం స్కెచ్‌లు గీయించారు. తర్వాత శరీర భాగాలు దొరికిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజిని పరిశీలించారు. వాటిలో సోహైల్‌ బైక్‌ ప్రయాణించినట్లు గుర్తించిన పోలీసులు అతని ఇంటి చుట్టుపక్కల వారిని విచారించారు. అక్కడి వారంతా గత కొంత కాలంగా సోహైల్‌ తల్లి కనిపించడం లేదని చెప్పడంతో పోలీసుల అనుమానం ఏర్పడింది. అంతేకాకుండా పోలీసుల విచారణలో సోహైల్‌ను సోదరి తల్లి గురించి ప్రశ్నించినప్పడు బంధువులను కలిసేందుకు దిల్లీ వెళ్లిందని చెప్పాడని తెలిపింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సోహైల్ అదుపులోకి తీసుకొని విచారించగా తల్లి తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.