close

తాజా వార్తలు

Published : 09/01/2020 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సత్తాచాటిన క్రికెటర్లు

రెండో రోజు ఉత్సాహంగా సాగిన ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019 పోటీలు

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ఈనాడు, స్ప్రైట్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌- 2019’ పోటీలు రెండో రోజు ఉత్కంఠ భరితంగా సాగాయి. హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో జూనియర్, సీనియర్‌ విభాగాల్లో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ జిల్లాల క్రీడాకారులు బౌలింగ్, బ్యాటింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ నిజామాబాద్‌ జట్టుకు వాకోవర్‌ లభించింది. తొలిరోజు బాలికల విభాగంలో జరిగిన పోటీల్లో విశ్వనాథ్‌ చైతన్య అద్భుతమైన ఆల్‌రౌండర్‌ ప్రతిభతో దుమ్మురేపింది. బాలికల విభాగంలో వరంగల్‌ క్రికెట్‌ సంఘం జట్టు, సీనియర్‌ విభాగంలో నిట్‌ వరంగల్, ఆదర్శ డిగ్రీ పీజీ కాలేజీ, మహబూబ్‌నగర్‌ జట్లు ఫైనల్స్‌లోకి ప్రవేశించాయి. బాలికల మ్యాచ్‌ల ప్రారంభ వేడుకలకు ఏకశిల విద్యాసంస్థల ఛైర్మన్‌ గౌరు తిరుపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్తమ నైపుణ్య ప్రదర్శన చేసి రంజీ మ్యాచ్‌ల వరకు వెళ్లాలని క్రీడాకారులకు సూచించారు. 

9 వికెట్ల తేడాతో వరంగల్‌ క్రికెట్‌ సంఘం మహిళా జట్టు గెలుపు 

తొలుత బ్యాటింగ్‌ చేసిన వాగ్దేవి డిగ్రీ కాలేజీ, మంచిర్యాల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. జట్టులో సుచరిత 22, సుప్రియ 2 పరుగులు చేశారు. ఛేదనకు దిగిన వరంగల్‌ క్రికెట్‌ సంఘం మహిళా జట్టు కేవలం 8 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 52 పరుగులు చేసింది. జట్టులో విశ్వనాథ్‌ చైతన్య 18(నాటౌట్‌), అశ్విని 16, కృష్ణవేణి 11 పరుగులు చేశారు. బౌలింగ్‌లో విశ్వానాథ్‌ చైతన్య 5 వికెట్లు తీసి రాణించడంతో వరంగల్‌ క్రికెట్‌ సంఘం జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఉత్కంఠ పోరులో నిట్‌ వరంగల్‌ విజయం

 నువ్వా నేనా అంటూ సాగిన పోరులో ఐఐఐటీ బాసర జట్టుపై నిట్‌ వరంగల్‌ జట్టు 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఐఐఐటీ బాసర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. జట్టులో రాహుల్‌ 33, దేవేందర్‌ 25, శ్రీను 13 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నిట్‌ జట్టు 19.5 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 111 పరుగులు చేసింది. జట్టులో కిరీటి 36, సంకేత్‌ 17, హిమాన్షు 10 పరుగులతో రాణించారు. నిట్‌ బౌలర్స్‌ మనీష్, కల్యాణ్‌ చెరో 2 వికెట్లు తీశారు.  

3 వికెట్ల తేడాతో వాగ్దేవి జూ.కాలేజీ, మహబూబ్‌నగర్‌ జట్టు విజయఢంకా 

జూనియర్‌ విభాగంలో ట్రినిటీ జూనియర్‌ కాలేజీ, కరీంనగర్‌ జట్టుపై వాగ్దేవి జూనియర్‌ కాలేజీ మహబూబ్‌నగర్‌ జట్టు 3 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ట్రినిటీ కాలేజీ జట్టు 18.1 ఓవర్లలో 10 వికెట్ల నష్టంతో 114 పరుగులు చేసింది. జట్టులో రాజాబాబు 26, శివ 23, జయంత్‌ 12 పరుగులు చేశారు. ఛేదనకు దిగిన వాగ్దేవి కాలేజీ జట్టు 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టంతో 115 పరుగులు చేసి విజయం అందుకుంది. జట్టులో బి.నవీన్‌ 24, జి.నవీన్‌ 19, తౌసీఫ్‌ 12 పరుగులు చేశారు. వాగ్దేవి బౌలర్లు జి.నవీన్‌ 3, బి.నవీన్‌ 2 వికెట్లు తీసి రాణించారు. 

వరంగల్‌ క్రికెట్‌ సంఘం మహిళా జట్టు భారీ విజయం

కరీంనగర్‌ క్రికెట్‌ సంఘం మహిళా జట్టుపై వరంగల్‌ క్రికెట్‌ సంఘం మహిళా జట్టు 105 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వరంగల్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 156 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందుంచింది. జట్టులో విశ్వనాథ్‌ చైతన్య 66(నాటౌట్‌), సోనీ 54 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌ చేసిన కరీంనగర్‌ జట్టు 13.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 51 పరుగులకే కుప్పకూలింది. జట్టులో బిందురెడ్డి 14 పరుగులు చేసింది. వరంగల్‌ జట్టు బౌలర్లు కృష్ణవేణి 4, దివ్య 2 వికెట్లు తీశారు. 

ఆదర్శ డిగ్రీ, పీజీ కాలేజీ మహబూబ్‌నగర్‌ జట్టు జయకేతనం

శాంతినికేతన్‌ డిగ్రీ కాలేజీ మిర్యాలగూడ జట్టుపై ఆదర్శ డిగ్రీ, పీజీ కాలేజీ మహబూబ్‌నగర్‌ జట్టు 15 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆదర్శ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టు 19.2 ఓవర్లలో 10 వికెట్ల నష్టంతో 120 పరుగులు చేసింది. జట్టులో రాకేష్‌యాదవ్‌ 41, ఆనంద్‌ 22, ప్రవీణ్‌కుమార్‌ 15 పరుగులతో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌కు దిగిన శాంతినికేతన్‌ జట్టు 18 ఓవర్లలో ఆల్‌ ఔట్‌ అయ్యి 105 పరుగులే చేసింది. జట్టులో అవినాష్‌ 25, సతీష్‌ 20, శ్రీమాన్‌ 17 పరుగులు చేశారు. ఆదర్శ కాలేజీ జట్టు బౌలర్లు ప్రవీణ్‌ 3, సాయి 2 వికెట్లు తీశారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.