close

తాజా వార్తలు

Published : 10/01/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బుజ్జాయిలతో హాయిగా..

గిలిగింతలు పెట్టే చలి.. చలచల్లగా మేనును తాకే శీతల సమీరం.. ఇవన్నీ యాత్రికులకు బంధువులు. కానీ పసి పిల్లలకు మాత్రం వీటితో కాస్త ఇబ్బందే. అసలే ప్రాంతం కాని ప్రాంతం. పైగా భిన్న వాతావరణం.. ఇంకేముంది... జలుబో.. జ్వరమో.. ఇలా ఎన్నో కాచుకుని ఉంటాయి. వాటి నుంచి బుజ్జాయిని రక్షించుకుంటే.. విహారం హాయిగా సాగిపోతుంది.

శీతకాలంలో విహారయాత్రకు వెళ్లే ముందు పిల్లల ఆరోగ్యస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. అసలే చలికాలం.. అందులోనూ హిల్‌స్టేషన్లకు వెళితే మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

చాలామంది పిల్లలకు ఈ చలికాలంలో శ్వాసనాళాలు మూసుకుపోతుంటాయి. తరుచుగా నెబ్‌లైజర్‌ వాడాల్సి వస్తుంది. ఓ పోర్టబుల్‌ నెబ్‌లైజర్‌ను వెంటతీసుకెళితే సరి. వైద్యుడి సలహా, సూచనల మేరకు కాస్త జాగ్రత్తగా దీన్ని వాడితే పిల్లలకు శ్వాస ఇబ్బందుల నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. విటమిన్‌ టానిక్‌లు, జ్వరం, జలుబు మాత్రలను వెంట తీసుకెళ్లడం మరిచిపోకూడదు.

బస చేసే గదిలో పిల్లాడిని పడుకోబెట్టే చోట పోర్టబుల్‌ మినీ హీటర్‌లాంటివి వాడితే చలి నుంచి రక్షణ లభిస్తుంది. పిల్లల ఒంటిని, తల, చెవులను కప్పి ఉంచేలా స్వెట్టర్‌ వేయాలి.

పొద్దున కాస్త ఆలస్యంగా.. మంచుతెరలు తొలగిన తర్వాత పిల్లలను విహారంలో బయటకు తీసుకెళ్లాలి. సాయంత్రం చీకటి కాకముందే బసకు చేరుకోవాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.