close

తాజా వార్తలు

Published : 12/01/2020 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుజరాత్‌ గ్యాస్‌ కంపెనీలో పేలుడు, 6గురి మృతి

వడోదర: గుజరాత్‌ లోని ఒక గ్యాస్‌ కంపెనీలో పేలుడు సంభవించటంతో పలువురు మృతి చెందారు. వడోదర జిల్లా, పడ్రా తాలూకా, గవాసద్‌ గ్రామ సమీపంలోని పారిశ్రామిక, ఔషధ సంబంధ గ్యాస్‌ను తయారుచేసే కర్మాగారంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదయం సుమారు 11 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడిన పలువురిని సమీపంలోని అస్పత్రిలో  చేర్చారు. సమాచారమందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన