close

తాజా వార్తలు

Published : 12/01/2020 00:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ స్త్రీమూర్తులిద్దరూ...

అమ్మ...

నాకోసం అమ్మ భువనేశ్వరీదేవి ఎన్నో పూజలు, ప్రార్థనలు చేసేది. కాశీ విశ్వేశ్వరుడికి ఆమె నిరంతరం పూజలు అభిషేకాలు చేసేది. అలాగే బాల్యం నుంచి నాకు రామాయణ, భారత గ్రంథాలను చదివి వినిపించేది. ఆంగ్లం కూడా అమ్మ నుంచే నేర్చుకున్నాను. నాలో ఉన్న సుగుణాలన్నీ మా తల్లి నుంచి పుణికిపుచ్చుకున్నవే. నా కీర్తిప్రతిష్ఠలు, ప్రతిభాపాటవాలన్నీ మా అమ్మ పుణ్యమే.

శారదమ్మ

నా గురువు రామకృష్ణపరమహంస ధర్మపత్ని శారదాదేవి పరిపూర్ణమైన శక్తిస్వరూపిణి. ఓ కుగ్రామం నుంచి వచ్చినా ఆమె దార్శనికత అద్వితీయం. ఆమెలోని ఆత్మగౌరవం, ఆత్మనిగ్రహం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. ఆమె అనుమతితోనే అమెరికాలో సర్వమత మహాసభల్లో పాల్గొన్నాను. స్వదేశీయులనేే కాదు విదేశీయులను కూడా సమస్థాయిలో ఆదరించి, పాశ్చాత్యులను కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనుచేశారామె. రామకృష్ణ సంఘం కూడా ఆమె ఆశీర్వాదంతోనే ప్రారంభించగలిగాం.

- స్వామి వివేకానంద (నేడు ఆయన జయంతి)


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని