close

తాజా వార్తలు

Published : 17/01/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ‘రాహుల్‌.. సీఏఏపై 10 ముక్కలు మాట్లాడు’

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో దేశాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. చట్టాన్ని అవగాహన చేసుకునే కనీస జ్ఞానం రాహుల్‌కు లేదని దెప్పి పొడిచారు. సత్తా ఉంటే 10 ముక్కలు సీఏఏ గురించి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. మతపరమైన పీడనకు గురై శరుణు కోరి దేశానికి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో వివరించారు. సీఏఏని వ్యతిరేకిస్తున్న వారు దేశాన్ని బలహీన పరుస్తున్నారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీబీఐ జేడీగా మనోజ్‌ శశిధర్‌

సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ)గా ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌ నియమితులయ్యారు. ఆయన 1994 గుజరాత్‌ కేడర్‌ అధికారి. మనోజ్‌ శశిధర్‌ ఐదేళ్లపాటు సీబీఐలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది 

3. జనసేన ముఖ్యనేతలతో పవన్‌ సమావేశం

భాజపాతో పొత్తు, త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా క్రియాశీల కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. రానున్న నెలరోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళిక రూపొందించాలని పవన్‌ సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కష్టపడేవారి జాబితాలు తయారు చేయాలని.. ఈనెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వరంగల్‌లో ‘సరిలేరు...’ విజయోత్సవం

5. ఎన్నికల ప్రక్రియను తారుమారు చేశారు:ఉత్తమ్‌

తెలంగాణలో జరగనున్న పురపాలిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ప్రక్రియను తారుమారు చేశారని.. న్యాయమైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే తెరాసకు ఒక్క సీటు కూడా దక్కదని ఉత్తమ్‌ అన్నారు. ఎన్నికల ప్రకటన, నామినేషన్ ప్రక్రియకు మధ్య వ్యవధి లేకపోవడం వల్లనే ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయని ఉత్తమ్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పవన్‌ పార్టీని ఓఎల్‌ఎక్స్‌లో పెట్టారు: పేర్ని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. పూటకో మాట మాట్లాడే వారి మాటలకు విలువ ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. 2019లో సీట్లు గెలవలేకపోయిన పవన్ కల్యాణ్ 2024లో ఏం గెలుస్తారని ఎద్దేవా చేశారు. భాజపాతో బేషరతుగా కలవడంలో ఆంతర్యం ఏమిటో తెలియజేయాలని పవన్‌ను నాని డిమాండ్ చేశారు. గతంలో ప్రధాని మోదీ, అమిత్‌ షాలపై ఆయన విమర్శలు చేశారని గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.  ‘మేం గెలిస్తే నిజామాబాద్‌ పేరు మార్చేస్తాం’

నిజామాబాద్ మేయర్ పీఠంపై ఎంఐఎంను కూర్చోబెట్టేందుకు తెరాస ప్రయత్నిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. భాజపా జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పురపాలక ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీలో ఉన్న డివిజన్లలో తెరాస డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ రాజకీయ నిరక్షరాస్యుడిలా మాట్లాడుతున్నారని.. మోదీ, అమిత్‌ షాలను విమర్శించే అర్హత ఆయనకు లేదని వ్యాఖ్యానించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మాదాపూర్‌లో సందడి చేసిన నిధి అగర్వాల్‌ 

9. ఆ పథకానికి ఆధార్‌ తప్పనిసరి

ఉగ్ర దాడులు, మతకలహాల్లో గాయపడిన వ్యక్తులు లేదా వారి కుటుంబీకులకు కేంద్ర ప్రభుత్వం అందించే పథకం నుంచి ఆర్థిక సాయం పొందాలంటే ఆధార్‌ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉగ్ర దాడిలో గాయపడిన వారు లేదా వారి కుటుంబీకులు, నక్సల్ దాడి బాధితులు, మతకలహాలల బాధితులు, భారత సరిహద్దుల్లో కాల్పులు, పేలుళ్ల బాధితులు  భారత ప్రభుత్వం అందించే పథకానికి అర్హులవ్వాలంటే తప్పనిసరిగా తమ ఆధార్‌ గుర్తింపును సమర్పించాలని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పంచాయతీ ఎన్నికల్లో.. ‘పాక్‌’ మహిళ పోటీ

పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చి నాలుగు నెలల క్రితం దేశ పౌరసత్వం సంపాదించిన ఓ మహిళ రాజస్థాన్‌ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. రాజస్థాన్‌లోని టోంక్‌ ప్రాంతానికి చెందిన నీతా సోదా అనే మహిళ పాక్‌ నుంచి భారత్‌కు వలస వచ్చి ఇక్కడే స్థిరపడింది. ఈమెకు సుమారు 18 ఏళ్ల తర్వాత భారత పౌరసత్వం లభించింది. ఇప్పుడు ఆమె రాజస్థాన్‌లో జరుగుతున్న నట్వారా పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.