close

తాజా వార్తలు

Published : 20/01/2020 19:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫొటోగ్రాఫర్‌ను ఆటపట్టించిన ఎన్టీఆర్‌

హైదరాబాద్‌: యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా బయట మాత్రం ఎంతో సరదాగా కనిపిస్తుంటారు. తన చుట్టూ ఉండే వాళ్లను ఆటపట్టిస్తూ అందర్నీ నవ్విస్తుంటారు. అయితే, తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఈసారి ఎన్టీఆర్‌.. ఓ ఫొటోగ్రాఫర్‌ను గుర్తుపట్టి మరీ పంచులు వేశారు. ఓ వాణిజ్య ప్రకటన నిమిత్తం ముంబయి వెళ్లిన ఎన్టీఆర్‌ తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో ఆయన నడుచుకుంటూ వస్తుండగా అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్‌ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. గమనించిన ఎన్టీఆర్‌.. ఆ ఫొటోగ్రాఫర్‌ను దగ్గరికి పిలిచి.. ‘నువ్వు ఇక్కడే ఉంటావా..? తిండి, స్నానం అన్నీ ఇక్కడేనా..?’ అని ఆటపట్టించాడు. దీంతో అక్కడున్న వాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారు. ఫొటోగ్రాఫర్‌ సైతం తనను ఎన్టీఆర్‌ గుర్తుపట్టి మరీ మాట్లాడటంతో ఉబ్బితబ్బిబయ్యాడు. గతంలోనూ ఎన్టీఆర్‌ ఎయిర్‌పోర్టు వెళ్లినప్పుడు ఆ ఫొటోగ్రాఫర్‌ ఫొటోలు తీసిన విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నాడు. మళ్లీ అతనే విమానాశ్రయంలో కనిపించడంతో ఇలా ఆటపట్టించాడు. ఎస్‌ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్‌ షూటింగ్‌లో బిజీగా మారాడు.ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఈ ఏడాది అక్టోబర్‌లో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.