close

తాజా వార్తలు

Published : 21/01/2020 21:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్టీఆర్‌ రీల్‌తండ్రి పేరుతో వెంకటేష్‌సినిమా!

హైదరాబాద్: ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్‌ తండ్రి నాగబాబు పాత్ర పేరు ‘నారప్ప’తో సినిమా రాబోతోందా? అవుననే అంటున్నారు. తమిళ హిట్‌ ‘అసురన్‌’ తెలుగు రీమేక్‌లో విక్టరీ వెంకటేష్‌ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘నారప్ప’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తెగ ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

అనుష్క నో చెప్పారా..?
ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం దర్శక, నిర్మాతలు అనుష్కను సంప్రదించారట. కొన్ని కారణాల వల్ల ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై అనుష్క స్పందించలేదు. వెట్రి మారన్‌ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ‘వెంకీమామ’ తర్వాత వెంకటేష్‌ ఈ సినిమాకు సంతకం చేశారు. ఇందులో లుక్‌ కోసం గడ్డం కూడా పెంచారు. మాతృకలో ధనుష్‌, మంజూ వారియర్‌ జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయం సాధించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.