close

తాజా వార్తలు

Published : 22/01/2020 20:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘నారప్ప’ మొదలెట్టాడు..!

హైదరాబాద్‌: విక్టరీ వెంకటేష్‌ కొత్త సినిమా ‘నారప్ప’ మొదలైంది. బుధవారం ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లాలో షూటింగ్‌ను మొదలెట్టారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘బ్రహ్మాత్సవం’ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా ఇది. మంగళవారం రాత్రి విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు విశేషమైన స్పందన వచ్చింది. వెంకీ ఇటీవల ‘వెంకీ మామ’తో హిట్‌ అందుకున్నారు. తమిళ హిట్‌ ‘అసురన్‌’కు రీమేక్‌గా ‘నారప్ప’ తెరకెక్కుతోంది. మాతృకలో ధనుష్‌, మంజూ వారియర్‌ ప్రధాన పాత్రలో నటించారు. రీమేక్‌లో కథానాయిక ఎవరో ఇంకా ప్రకటించలేదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.