close

తాజా వార్తలు

Published : 24/01/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పొత్తికడుపు నొప్పి పోయేదెలా!

*మా పాప వయసు పదమూడేళ్లు. తను పీరియడ్స్‌ సమయంలో విపరీతమైన పొత్తికడుపు నొప్పితో బాధపడుతుంది. ఈ సమస్య చాలామంది మహిళల్లో కనిపిస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? తగ్గడానికి ఏమైనా మార్గముందా?

- ఓ సోదరి
నెలసరి సమయంలో చాలామందిలో పొత్తికడుపులో నొప్పిగా ఉండటం సాధారణంగా వచ్చే సమస్యే. మొదటిరోజు నొప్పి వచ్చి రక్తస్రావం అధికమైనప్పుడు నొప్పి తగ్గిపోతే దాన్ని స్పాస్మోడిక్‌ డిస్‌మెనోరియా అంటాం. దీనికి ముఖ్య కారణం గర్భాశయ ముఖద్వారం గట్టిగా ఉండటం. కాబట్టి ఆ ప్రాంతాన్ని మృదువుగా చేయడానికి తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రలు వాడాలి. ఇలా వాడకపోతే గర్భాశయంలో ఎండో మెట్రియం పొర బయటకు వచ్చే మార్గం కష్టమవడంతో ఫెలోపియన్‌ నాళాల ద్వారా పొత్తికడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇది ఎండోమెట్రియోసిస్‌కు కూడా దారితీయొచ్చు. చాలామందిలో పెళ్లయిన తరువాత,  ప్రసవం సమయంలో ప్రాస్థా గ్లాండిన్స్‌ విడుదలవడం వల్ల ఈ నొప్పి తగ్గుతుంది. ఇలా కాకుండా పీరియడ్స్‌ మొదలయ్యే రెండు మూడు రోజుల ముందు నుంచే నొప్పి ప్రారంభమై నెలసరి పూర్తయ్యేవరకు కొనసాగితే... అది మాత్రలతోనూ తగ్గకపోతే దాన్ని కంజెస్టివ్‌ డిస్‌మెనోరియా అంటారు. దీన్ని కొన్ని రకాల వ్యాధుల్లో మాత్రమే చూస్తాం. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారు స్కానింగ్‌, కొన్ని రకాల రక్తపరీక్షలు చేసి ఏ రకమైన డిస్‌ మెనోరియానో తెలుసుకుంటారు. దానికి అనుగుణంగా మందులు, శస్త్రచికిత్సలను సూచిస్తారు.  ముందుగా మీరు గైనకాలజిస్టును కలవండి.
- మీ సందేహాలను, సమస్యల్ని
vasuhealth@eenadu.net కు పంపించగలరు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.