close

తాజా వార్తలు

Published : 25/01/2020 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంతరిక్షంలో.. ట్వీటుతార!

ఆమె ట్విటర్‌ పేజీలో ఏ పోస్ట్‌ చూసినా ఆసక్తిగానే ఉంటుంది. జడ వేయడం ఎలా? బిస్కెట్లు తయారుచేయడం ఎలా? ఇలా...! అరే.. ఇవేమంత ఆసక్తికరమైనవి కావుకదా అని మీరు అనుకోవచ్ఛు కానీ ఇవన్నీ అంతరిక్షంలో ఎలా చేస్తారనేదే చెబుతోంది క్రిస్టినా కోచ్‌! అందుకే ఆ పోస్టులు అంత ఆసక్తిగా ఉంటాయి... తను చూసిన వింతలని భూమ్మీద ఉన్న మనతో తన ట్విటర్‌ అకౌంట్‌ సాయంతో పంచుకుంటోంది. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలివి.

క్రిస్టినాకోచ్‌ నాసా వ్యోమగామి. నిజానికి ఆమె గడిపే వ్యోమనౌకలోని చోటు చాలా చిన్నది. ఇరుకుగా ఉంటుంది. పైగా మన భూమ్మీద ఉన్నట్టుగా అనువైన వాతావరణం ఉండదు. చుట్టూ ఎటుచూసినా అనంత ఆకాశం మాత్రమే కనిపిస్తుంది. అలాంటిచోట కూడా క్రిస్టినా ఓ ఆసక్తికరమైన ప్రపంచాన్ని ఆవిష్కరించుకుంది. ●

అంతరిక్షంలో నా తోటి వ్యోమగామి జెస్సికాకు జడవేశా. డబుల్‌ బ్రెయిడ్‌ మోడల్‌ అది. ఎగిరిపోతున్న జుట్టుని పట్టుకుని, ఓవైపు మనం కూడా కదిలిపోతూనే... జడ వేయడం అంత తేలికైన విషయం కాదు. ఈ జడ స్పేస్‌సూట్‌ వేసుకున్నప్పుడు హెల్మెట్‌ కిందకు చక్కగా ఇమిడిపోయి, ఎగరకుండా పొందిగ్గా ఉంటుంది. దీన్నే స్పేస్‌వాక్‌ హెయిర్‌ ప్రో టిప్‌ అంటారు.

అంతరిక్షంలో తొలిసారిగా అవెన్‌లో బిస్కెట్లు తయారుచేశాం. ఇదొక కొత్త అనుభవం. వీటిని భూమ్మీదకు పంపించాం. శాంటాకు ఈ ఏడాది వాటిని బహుమతిగా అందించాం.

రాత్రి సమయంలో స్పేస్‌స్టేషన్‌ నుంచి మైళ్ల దూరంలో ఉన్న నైలు నది ప్రకృతి కాన్వాస్‌పై తీర్చిదిద్దిన చిత్రలేఖనంలా ఉంది. భూమిపై కాంతులు వెదజల్లినట్లుగా అనిపిస్తోంది.

స్పేస్‌వాక్‌ చేసి పవర్‌బ్యాటరీని మార్చడంలో నేను, జెస్సికా నిమగ్నమై ఉన్నప్పుడు అంతరిక్షకేంద్రం నుంచి ఆస్ట్రో లుసా తీసిన చిత్రంలో నాకు మా టీం వర్క్‌ కనిపిస్తోంది. ఈ అనుభవాన్ని జీవితంలో మరవలేను. ●

రికార్డులతో...

క్రిస్టినా ఇప్పటికే అత్యధికకాలం అంతరిక్షనౌకలో ఉన్న తొలి మహిళావ్యోమగామిగా, స్పేస్‌వాక్‌ చేసి... మరమ్మతుకు గురైన వ్యోమనౌకను బాగు చేసి, రికార్డు సాధించింది. తాజాగా మరోసారి స్పేస్‌వాక్‌ చేసి బ్యాటరీలను మార్చి ఇంకో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇదంతా తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని, తనలాంటి మహిళలందరికీ స్ఫూర్తిగా నిలవడం తృప్తిగా ఉందని అంటుందీమె. మరో రెండు వారాల్లో భూమిపై అడుగుపెట్టనుంది క్రిస్టినా.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని