close

తాజా వార్తలు

Updated : 26/01/2020 13:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజ్‌పథ్‌లో బతుకమ్మ, బ్రహ్మోత్సవం

 

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. సైనిక విన్యాసాలు, శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాలు ఆయా ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టాయి. బతుకమ్మ, వేయిస్తంభాల గుడితో రూపొందించిన తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శకటంపై గుస్సాడీ, లంబాడీల నృత్యాలు తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని చాటాయి. శకటం ప్రదర్శిస్తున్న సమయంలో ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’, ‘సమ్మక్క, సారలమ్మ..’ గీతాలు పరవశింపజేశాయి.

అనంతరం వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ శకటం ఏడుకొండల వేంకన్న సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాల మహత్యాన్ని చాటాయి. శకటంపై రూపొందించిన తిరుమల తిరుపతి గర్భగుడి, ‘బ్రహ్మోత్సవం.. బ్రహ్మోత్సవం..’అంటూ సాగిన సంకీర్తన గణతంత్ర వేడుకల్లో భక్తి పారవశ్యాన్ని చాటాయి. ఇక జమ్మూకశ్మీర్‌ గ్రామీణ ప్రాంత సంస్కృతి వారి చేతివృత్తుల సంప్రదాయం ఉట్టిపడేలా ఆ రాష్ట్ర శకటాన్ని రూపొందించారు. అంతరించిపోతున్న అరుదైన కప్పల జాతిని కాపాడుకుందాం అన్న ఇతివృత్తంతో తయారు చేసిన గోవా శకటం వీక్షకుల్ని కనువిందు చేసింది.

 

మరోవైపు అధునాతన యుద్ధ విమానాలు చినూక్‌, అపాచీల ప్రదర్శన భారత సైనిక శక్తిని చాటాయి. మహిళా సైనికులు బైక్‌పై చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గత సంవత్సరం ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని(ఏశాట్‌) విజయవంతంగా పరీక్షించిన కేంద్రం ఈ వేడుకల్లో దాన్ని ప్రదర్శించింది. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనిక వందనం స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారక స్థూపం వద్ద అమలవీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకులకు బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.